–సమ్మె ఒప్పందాలను అమలు చేయాలి
CITU: ప్రజా దీవెన, నల్లగొండ: అంగన్వాడి ఉద్యోగులను (Anganwadi employees) 65 సంవత్సరాల పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (Anganwadi Teachers and Helpers Union) (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి. డిమాండ్ చేశారు .శనివారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నలగొండ కలెక్టరేట్ ముందు దీక్షలు మహా ధర్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగుల సమస్యల తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు నిరవధిక సమ్మె చేయడం జరిగిందని అన్నారు.
ఆ సమ్మె సందర్భంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Govt) అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐసిడిఎస్ మంత్రి సీతక్కకు (ICDS Minister Sitakka) ఉన్నతాధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.గత ప్రభుత్వం జీవో 10 ఇచ్చి తక్కువ బెనిఫిట్ తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె అన్నారు. ఈఅంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తక్కువ బెనిఫిట్ ఇచ్చి అన్యాయంగా తొలగించడానికి వ్యతిరేకిస్తున్నామ ని అన్నారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అంగ న్వాడీ టీచర్లకు హెల్పర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతూ టీచర్‌కు రెండు లక్షలు హెల్పర్ కు లక్ష రూపాయలు పెన్షన్ 8000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం డిడబ్ల్యూ ఓ సక్కుబాయి కి వినతిపత్రం సమ ర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి (CITU State Vice President Tummala Veera Reddy), సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిలు దండెంపల్లి సత్తయ్య చింతపల్లి బయన్న, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి నాగమణి, ప్రధాన కార్యదర్శి బి పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు మన్నెమ్మ పరిపూర్ణ, సహాయ కార్యదర్శి కే రజిత జిల్లా నాయకులు యాదమ్మ రాధా బాయ్ లక్ష్మి, ప్రమీల, సైదమ్మ, సునంద ,సరిత, నాగమణి. స్వరాజ్యం, స్వప్న, అనిత, సుభాషిని, అరుణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, వరికుప్పల ముత్యాలు, ఆదిమల్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.