Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Media Academy building in grandeur అంగరంగ వైభవంగా మీడియా అకాడమీ భవనం

-- సీఎం అనుమతితో త్వరలో ప్రారంభానికి సిద్ధం -- తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ

అంగరంగ వైభవంగా మీడియా అకాడమీ భవనం

— సీఎం అనుమతితో త్వరలో ప్రారంభానికి సిద్ధం

— తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ

ప్రజా దీవెన/హైదరాబాద్: హైదరాబాద్ నగర నడిబొడ్డులోని
నాంపల్లి లో గల పాత ప్రెస్ అకాడమీ(press accodamy) స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ (allam Narayana)తెలిపారు. వెయ్యి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ స్థాయి ( corporat level)సాంకేతిక తో అంగరంగ వైభవంగా నిర్మించిన భవనాన్ని సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన వెంటనే ప్రారంభించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మీడియా భవనం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ (CM kcr)ను ఇప్పటికే ఆహ్వానించడం జరిగిందని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పాత అకాడమీ భవనం లో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం(new building)నిర్మించాలని సూచించారు. ఆ మేరకు 2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కర్త, కర్మ, క్రియ గా ఈ భవనం రూపుదిద్దుకున్నదని తెలిపారు.

భవనంలో జర్నలిస్టుల (journalist) కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు, రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు (special rooms) నిర్మించడం జరిగిందన్నారు.తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం (latest technology) ఏర్పాటుచేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించామని చెప్పారు.

అధికారులతో కలిసి సందర్శించిన అల్లం….నిర్మాణం పూర్తి చేసుకున్న మీడియా భవనాన్ని (media building)మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ రాజమౌళి తదితర అధికారులు పర్యవేక్షించారు.భవనం పనులన్నీ తుదిదశ కు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దవలసిందిగా ఆర్ అండ్ బి అధికారులను కోరారు.


మీడియా అకాడమీకి సొంత భవనం సిద్ధం... సిఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్(I& PR commissnor)అశోక్ రెడ్డి ఇంజనీర్లకు కొన్ని సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని (Inauguration) ఆయన తెలిపారు.