Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti vikramarka: పుట్టింది బతకడానికి చావడానికి కాదు

— రైతు ఆత్మహత్య అత్యంత బాధా కరమైన అంశం
–రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యా యం చేస్తాం, అన్ని విధాల ఆదు కుంటాం
–నిష్పక్షమైన విచారణతో బాధ్యు లు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం
–అంతా నా వాళ్లే తప్ప రాజకీయా లకు స్థానం లేదు
— ఖమ్మంలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Bhatti vikramarka: ప్రజా దీవెన, ఖమ్మం: ప్రాణం చాలా విలువైనది, మనం పుట్టింది బతక డానికి కానీ చావడానికి కాదని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka)మల్లు వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద సమస్య ఉన్న ఎక్కడో ఒకచోట పరిష్కా రం మార్గం వెతుకొని బతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రైతును ఆత్మహత్యకు (suicide)పురిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే నిష్పక్షపాతంగా విచా రణ జరిపించి బాధ్యులైన వారి పైన చట్టపరంగా పూర్తిస్థాయిలో చర్య లు తీసుకోవాలని సంబంధిత పోలీ సు అధికారులను ఆదేశించానని తెలిపారు.

చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన చేపల సొసైటీ, ఇరిగేషన్ కు సంబంధించి. తన భూమి, వేసినటువంటి మెరక ను తొలగించారని రైతు ప్రభాకర్ మనస్థాపన చెంది ఆత్మహత్య (suicide) చేసు కున్నట్టు మీడియా ద్వారా మిగతా వారిద్వారా తెలిసింది. రైతు తండ్రి తో మాట్లాడాను. వారి శ్రీమతితో పిల్లలతో మాట్లాడాను, జరిగిన సం ఘటన చాలా బాధాకరం, ఆది వారం చింతకాని మండలం ప్రొద్దు టూరు గ్రామంలో ఇటీవల ఆత్మ హత్యకు పాల్పడిన రైతు(farmer) ప్రభాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శిం చిన అనంతరం స్థానికంగా మీడి యాతో మాట్లాడారు.ఇక్కడ అంద రూ మా వాళ్లే, అందరూ నా వాళ్లే జరిగిన పొరపాటుకు ఎవరూ కారణ మైన సరే ఎవరిని ఉపేక్షిం చేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నారు.

బాధిత కుటుం బానికి తప్పనిసరిగా న్యాయం జరిగేటట్టుగా ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా రైతు ప్రభాకర్ భూమికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు. చేపల సొసైటీ, ఇరిగేషన్, రెవెన్యూ (irrigation and revenue department) వారితో మాట్లా డి సమస్య ఏంటో తెలుసుకొని శాశ్వ త పరిష్కారం చూపాలని కలెక్టర్ ను ఆదేశించాను అన్నారు. పిల్లలు చదువుకోవడానికి అవస రమైన సహాయ సహకారాలు పూర్తిగా ఏర్పాటు చేస్తానని, పిల్లలు బాగా చదువుకోవాలని మనస్పూ ర్తిగా కోరుకుంటున్నానని, వారు చదువుకున్నంత కాలం చదివిస్తాను ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.ఇతరత్రా సమస్యలకు సంబంధించి కుటుంబ సభ్యులు రాసి ఇచ్చారు వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం ఎలాం టి ఇబ్బంది లేదు అన్నారు.

ఇక్కడ అందరూ మావాళ్లే.. ఇటువంటి కేసుల్లో అసలు పార్టీలకు సంబంధ మే లేదు, స్థానం లేదు ఇది మానవ త్వంతో అందరూ చూడాల్సిన సం ఘటన ఏ పార్టీ వారైనా మనిషే.. మ నిషి ప్రాణం విలువైనది అని పేర్కొ న్నారు. ఈ సంఘటనలో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు.