–ఈడీ కేసులున్న నేతలెవ్వరు బీజేపీలోకి రారు
–రామాయణ్ సర్క్యూట్ కింద కొం డగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధి
–కరీంనగర్, హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తి
–రాష్ర్టపార్టీ అధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిది
–కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి
–కరీంనగర్ మీడియాతో ఇష్టాగో ష్టిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Bandi Sanjay:ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణలో ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు (MLAs and public representatives) బీజేపీలోకి (bjp) రావాలంటే తప్పని సరి గా ఆ పదవులకు రాజీనామా చే యాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay)తెలిపారు. ఈడీ, సీబీఐ (ED, CBI) కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇ ల్లందకుంట ఆలయాలను రామా యణ్ సర్క్యూట్ కింద అభివ్రుద్ధి చేసే అవకాశాలున్నాయని చెప్పా రు. కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సాధ్యాసాధ్యాలపై రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తయ్యాయన్నారు.
ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయం లో బండి సంజయ్ (Bandi Sanjay) మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం మరింత జఠిలం చేసి సమ స్యను నాన్చుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అవసరం లేదని, రెండు రా ష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారని కితాబిచ్చారు. చిత్తశుద్ధి తో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముంది. ఇప్పటికే కేసీఆర్ (kcr) గోతికాడ నక్క లా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కోరుతున్నా. సీఎంలు చర్చించుకున్న విషయాలు మా దృష్టికి రావాలి కదా,రెండు రాష్ట్రా లు సానుకూలంగా ఉండడం మంచిదన్నారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమే లేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదు.
ఈడీ కేసులున్న (ed) వాళ్లు, ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి (bjp) వచ్చే అవకాశాలు లేవు. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మాదిరిగా రాజీనామా చేయకుండా బీజేపీలోకి వచ్చే అవకాశమే లేదు. బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదు? కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలి. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే కచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుంది.
అధ్యక్ష మార్పుపై..స్టేట్ ప్రెసిడెంట్ (State President) మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుం టుంది. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై అన్నీ ఆలోచించి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది.
రామాయణ్ సర్క్యూట్, కరీంనగర్హసన్ పర్తి రైల్వే లేన్ పై
రామాయణ సర్క్యూట్ (Ramayana circuit) కింద ఇల్లంతకుంట ,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అందుకోసం నేను తప్పకుండా క్రుషి చేస్తా. ఎములాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతాం.. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ (kcr) మూర్ఖంగా వ్యవహరించారు. కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు. కరీంనగర్ -హాసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగింది. రైల్వే లైన్ (Railway line) వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన విజ్ఝప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించింది. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.