Five days of school holidays are coming…! స్కూళ్లకు ఐదు రోజుల సెలవులు రానున్నాయా…!
-- నేడు, రేపు సెలవులతో కలిపి
స్కూళ్లకు ఐదు రోజుల సెలవులు రానున్నాయా…!
— నేడు, రేపు సెలవులతో కలిపి
ప్రజా దీవెన/ హైదరాబాద్:తెలంగాణ లో విరామం లేని కుండపోత వర్షాలతో విద్యాసంస్థలకు(education institutetions) సెలవుల పరంపర కొనసాగుతోంది. భారీ వర్షాలకు (heavy rain) రాకపోకలు స్తంభించడం పరిపాటిగా మారిన నేపద్యంలో ప్రభుత్వం తాజాగా రెండు రోజుల పాటు సెలవులు( holidays) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో రెండు రోజుల సెలవులకు తోడు మరో మూడు రోజుల సెలవులు అమలు కానున్నాయి.
వర్షాల కారణంగా బుధ, గురు వారాలు సెలవు కాగా 28వ తేదీ మొహర్రం(moharam)ఐచ్చిక సెలవు, 29వ తేదీన సహజంగానే సెలవు. అదే విధంగా 30వ తేదీ ఆదివారం కలిసి వస్తుంది. అయితే ఇక్కడ 28వ తేదీ అఫ్సనల్ హాలిడే అనేది కేవలం ఉద్యోగులకే వర్తిస్తుండగా ఆ ఒక్క రోజు స్కూళ్లకు(schools)కూడా సెలవు అమలు చేస్తే నేటి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయని చెప్పవచ్చు.