–మన ఊరు మన బడి, అల్పాహా రం నిలిపేసిన సీఎం
–విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శాపంగా మారిన కాంగ్రెస్ పరిపాలన
–సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీశ్ లేఖాస్త్రం
Harish Rao:విధాత, హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)విద్యా వ్యవస్థ పై విపరీత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao) మండి పడ్డారు. ఆదివారం ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) బహి రంగ లేఖ రాశారు. అరకొర వస తులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్త కాల కొరత, దుస్తుల కొరత, తాగు నీటి కొరత, వేతనాల చెల్లింపు ఆల స్యం తదితర సమస్యలు తెలంగా ణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నా యని విమర్శించారు. విద్యాశాఖ (Department of Education)నిర్వర్తిస్తున్న మీరు, రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధా న్యం ఇస్తున్నారు తప్పా ప్రజా సమ స్యలను పరిష్కరించడంపై ఏమా త్రం దృష్టి సారించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పా టయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ (kcr) ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల సమయంలో కొత్తగా మీ కాంగ్రెస్ ప్రభు త్వం చేసిందేమీ లేకుండా పోయింద న్నారు.
గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడం లోనూ ప్రభుత్వం విఫలమైంద న్నారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల లకు (teachers, students, government schools) శాపంగా మారింద న్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు బీఆరెస్ ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దాన్ని కొన సాగించ కుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పాఠశా లలో విద్యార్థులకు సన్నబియ్యానికి బదులు ముక్కిన బియ్యంతో భోజనం పెడు తున్నారని విద్యార్థుల పౌష్టి కాహారం కోసం అందించే కోడి గుడ్ల బిల్లులు సైతం చెల్లించని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఇవ్వ కుండా ఒకే జత బట్టలు (Pair of clothes) మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.
ఒక్క విద్యార్థి కూడా ఆకలితో అలమటించవద్దనే మానవతా దృక్పథంతో గత ప్రభుత్వం 27 వేల పాఠశాలల్లో ప్రారంభించిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అటకెక్కించిందని విమర్శించారు. మరోవైపు సకాలం లో వేతనాలు అందక సిబ్బంది ఇ బ్బందులు పడుతున్నారన్నారు. పారిశుధ్య నిర్వహణ (Sanitation Management) సరిగ్గా లేకపో వడంతో పాఠశాలల్లో దోమలు, ఈగ లు ముసురుతున్నాయని, ఉపా ధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవ డంతో సిలబస్ ప్రకారం, పాఠ్యాం శాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కరెంట్ బిల్లులు చెల్లించకపోవ డంతో అంధకారం అలుముకుంటున్నది. పాఠశాల విద్యావ్యవస్థను ఇన్ని సమస్యలను చుట్టుముట్టినా మీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం బాధా కర మన్నారు. భావిభారత పౌరు లను తయారుచేసే పాఠ శాలల నిర్వహణను గాలికి వదిలేయడం విద్యాభివృ ద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి నిదర్శనమ న్నారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేం దుకు చర్యలు తీసుకోవాలని, సమ స్యలను పరిష్కరించాలని బహిరం గ లేఖలో డిమాండ్ చేశారు.