Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Oneplus watch 2 Discount: వన్‌ప్లస్‌ వాచ్‌పై భారీ డిస్కౌంట్‌

Oneplus watch 2 Discount: ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ వాచ్‌లకు (smart watch) భారీగా డిమాండ్‌ (demand) పెరిగింది అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు స్మార్ట్‌ వాచ్‌లకు ధరించదానికి ఇష్టం చూపుతున్నారు. దీంతో దాదాపు అన్ని టెక్‌ దిగ్గజాలు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్ లోకి తీసుకోని వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్ (Electronics giant OnePlus)సైతం ప్రీమియం స్మార్ట్ వాచ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇక వన్‌ప్లస్ వాచ్‌ 2 పేరుతో ఓ వాచ్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ వాచ్‌ 2 సంబంధించిన పూర్తి వివరాలు ఇలా

వన్‌ప్లస్ గత కొన్ని నెలల క్రితం తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ వాచ్‌2పై (OnePlus Watch 2)భారీ డిస్కౌంట్‌ తో యూజర్స్ కోసం రాబోతుంది . ఈ వాచ్‌పై ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ను తీసుకొచ్చిన అమెజాన్‌లో (amazon)భారీ డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ఇంతకీ వాచ్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఏంటి.? లాంటి వివరాలు ఇలా. వాస్తవానికి వన్‌ప్లస్‌ వాచ్‌2 అసలు ధర రూ. 27,999కాగా ప్రస్తుతం 14 శాతం డిస్కౌంట్‌తో రూ. 23,999కి అమెజాన్‌లో లభిస్తోంది. దీంతో అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో పే చేస్తే రూ. 719 వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా పొందొచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు డిస్కౌంట్ ను యూజర్స్ పొందొచ్చు. ఇలా వాచ్‌పై గరిష్టంగా రూ. 6 వేల వరకు డిస్కౌంట్ ను యూజర్స్ చాలా సులువుగా పొందవచ్చు.

అలాగే వన్‌ప్లస్ వాచ్‌ 2 ఫీచర్ల (features)విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు కంపెనీ వారు. 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెట్ (Nits Peak Brightnet)ఈ వాచ్‌ స్క్రీన్‌ సొంతం. ఈ వాచ్‌లో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది. ఇందులో ప్రత్యేకంగా పవర్ సేవర్‌ మోడ్‌ను, వూక్‌ ఫాస్ట్ చార్జింగ్‌తో తీసుకొచ్చిన ఈ వాచ్‌ 60 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఈ వాచ్‌లో 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ను , స్లీప్ ట్రాకింగ్‌, స్ట్రెస్‌ మానిటరింగ్‌, హార్ట్‌ రేట్ మానిటరింగ్‌ (Sleep tracking, stress monitoring, heart rate monitoring)వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు. వియర్‌ ఓస్‌4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీరు ఒకవేళ ఈ వన్‌ప్లస్ వాచ్‌ 2 కొనాలి అనుకుంటే ఇదే సరైన సమయం అనే చెప్పాలి.