Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Corporations: కార్పొరేషన్ల ‘ సందడి ‘

–కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
–తెలంగాణలో మొత్తంగా 35 మం ది నియమించిన కాంగ్రెస్ అధిష్టా నం

Corporations: ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణ (Telangana)రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు (Corporations) ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 15నే జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్‌(elections code)దృష్ట్యా ఆగిన ఛైర్మన్ల నియామకపు ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా సోమవారం తిరిగి విడుదల చేసింది. మొత్తం 35(35 members)మంది ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

నామినేటెడ్ పదవుల భర్తీపై వీడిన ఉత్కంఠ : కార్పొరేషన్ల కార్పొరేషన్లు ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. 35 కార్పొరేషన్ల ఛైర్మన్‌లను (corporation chairman)నియమిస్తూ మార్చి 15నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఛైర్మెన్లు బాధ్యతలు చేపట్టలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత తమకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. కార్పొరేషన్ ఛైర్మన్‌లలో కొందరిని మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీలో (Congress party)అంతర్గతంగా గందరగోళం తలెత్తడంతో, ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ఎట్టకేలకు నేడు జీవోలను బహిరంగపరిచిన ప్రభుత్వం రెండ్రోజుల్లో కొత్త ఛైర్మన్లు బాధ్యతలు స్వీకరించాలని తెలిపింది.

35 కార్పొరేషన్ల ఛైర్మన్ల వీరే…
పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు వెల్లడి
మార్చి 15నే జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం
విత్తనాభివృద్ధి ఛైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి
ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కాసుల బాలరాజు
ఆయిల్‌ సిడ్స్‌ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి
రాష్ట్ర సహకార సంఘం ఛైర్మన్‌గా మోహన్‌రెడ్డి
గిడ్డంగులు సంస్థ ఛైర్మన్‌గా నాగేశ్వరరావు
ముదిరాజ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌
మత్స్యసహకార సమాక్య ఛైర్మన్‌గా మెట్టు సాయికుమార్‌
గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా రియాజ్‌
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పొదెం వీరయ్య
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కాల్వ సుజాత
పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి
సెట్‌ విన్‌ ఛైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి
కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా జనక్‌ ప్రసాద్‌
నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ విజయ్‌బాబు
హస్త కళల అభివృద్ధి ఛైర్మన్‌గా నాయుడు సత్యనారాయణ
ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్‌ ఎర్రవాత్‌
టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నిర్మలాజగ్గారెడ్డి
వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ప్రకాశ్‌రెడ్డి
సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె సతీష్‌కుమార్‌
పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చల్లా నరసింహారెడ్డి
శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కె.నరేందర్‌రెడ్డి
కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఈ.వెంకటరామిరెడ్డి
రహదారి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మల్‌రెడ్డి రామిరెడ్డి
పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పటేల్‌ రమేశ్‌రెడ్డి
తెలంగాణ ఫుడ్స్‌ ఛైర్మన్‌గా ఎం.ఎ.ఫహిమ్‌
మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్స్‌న్‌గా శోభారాణి
వికలాంగుల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఎం.వీరయ్య
స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌గా శివసేనారెడ్డి
సంగీత నాట్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా అలేక్య పుంజాల
ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎన్‌.ప్రీతం
బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నూతి శ్రీకాంత్‌
ఎస్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బెల్లయ్య నాయక్‌
గిరిజన కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కె.తిరుపతి
ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జైపాల్‌
మైనార్టీ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఎం.ఎ.జబ్బార్‌