*న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
Bar association leaders: ప్రజా దీవెన, కోదాడ: భద్రాచలంలో న్యాయవాదిని పోలీసులు స్టేషన్ (Police station)లో కొట్టి చేతులకు బేడీలతో కోర్టులో హాజరు పరచడాన్ని కోదాడ బార్ అసోసియేషన్ నాయకులు (Bar association leaders) తీవ్రంగా ఖండించారు. సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదుల పట్ల పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని (Protection Act) పటిష్టంగా అమలు చేయాలని న్యాయవాదిపై దాడి చేసిన సంబంధిత వ్యక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మేకల. వెంకటరావు,హనుమంతరావు ఉపాధ్యక్షులు గట్ల. నరసింహారావు,రంజాన్ పాష, ఎడ్లపల్లి.వెంకటేశ్వర్లు,ఉదారు. శ్రీను, యశ్వంత్,ముల్క. వెంకట్ రెడ్డి, ఉయ్యాల.నరసయ్య,దావీదు,గోవర్ధన్,రహీం,జానీ పాషా, మోష,మంద. వెంకటేశ్వర్లు,కోడూరు. వెంకటేశ్వరరావు,రమేష్, కోదండపాణి, శ్రీధర్, నవీన్,చలం, శరత్, హేమలత,శిల్ప, సంధ్య,నాగరాజు, శివకృష్ణ,భీమయ్య, నాగుల్ పాషా తదితరులు పాల్గొన్నారు