Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో నైపుణ్య విశ్వవిద్యాలయం

–గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటు కు అవకాశాలను పరిశీలించాలన్న సీఎం రేవంత్‌
–అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదికి వ్వండి
–కోర్సులు, పాఠ్యాంశాలపై అధ్య యనం చేయండి, 24 గంటల్లోనే తగిన నిర్ణయం తీసుకుంటాం
–వర్సిటీ ఏర్పాటు వ్యవహారాల ప ర్యవేక్షణకు నోడల్‌ డిపార్ట్‌మెంట్‌గా పరిశ్రమల శాఖ
–పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వ విద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఈ నెలా ఖరున జరిగే అసెంబ్లీ సమావేశాల (Assembly meetings) కు ఒకటి రెండు రోజుల ముందుగా నే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదన లతోరావాలని అధికారులతోపాటు, పారిశ్రామికరంగ ప్రముఖులకు సూ చించారు.

ప్రతిపాదనలను పరిశీ లించిన అనంతరం 24 గంటల్లోనే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసు కుంటుందని చెప్పారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో (Engineering Staff College) ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన స్కిల్‌ యూనివర్సిటీ అంశంపై సోమ వారం డిప్యూటీ సీఎం భట్టివిక్ర మార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రముఖ పారిశ్రా మికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధి కారులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతోపాటు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ (Engineering Staff College)ప్రాంగంణంలోనే స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఐటీ కంపెనీలతోపాటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఈ–సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అధునాతన పరిజ్ఞానం అందించేలా స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో, కరిక్యులమ్‌, కోర్సులకు (With CM Bhattivikramarka, for curriculum and courses) సంబంధించి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని అధికారులకు సూచించారు.

నిర్ణీత గడువు విధించుకుని ప్రతిపాదనలను రూపొందించాలని, అసెంబ్లీ సమావేశాలకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉన్నందున.. ప్రతి ఐదు రోజులకోసారి సమావేశం కావాలని అన్నారు. సమీక్ష సమావేశానికి ముందు ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్‌ సెంటర్‌ను సీఎం రేవంత్‌ పరిశీలించారు. స్కిల్‌ యూనివర్సిటీ (Skill University) ఏర్పాటుకుగాను ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తరహాలో ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేయాల్సి ఉంటుందని సమావేశంలో చర్చ జరిగింది. అయితే బోర్డు ఏర్పాటయ్యే వరకు సమావేశానికి హాజరైన ప్రతినిధు లందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని సీఎం నిర్ణయించారు. దీంతోపాటు యూనివరిటీలో ఏయే కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్‌ అందుబాటులో ఉండాలనే విషయాలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు లభించేందుకు ఏయే నైపుణ్యాలపై కోర్సులను నిర్వహించాలనే విషయాన్ని కూడా ముందుగానే అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు (Government and private భాగస్వామ్యంతో యూనివర్సిటీని ఏర్పాటు చేయా లా, ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలా, లేదంటె మరేదైనా విధా నాన్ని అనుసరించాలా అనే అంశా న్ని కూడా పరిశీలించాలన్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రా జెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేం దుకు ఆ రంగంలో నిపుణుడైన కన్సల్టెంట్‌ను నియమించుకోవాలని సూచించారు. యూనివర్సిటీ ఏర్పా టు వ్యవహారాల పర్యవేక్షణకు పరి శ్రమల శాఖ నోడల్‌ డిపార్ట్‌మెం ట్‌గా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఐటీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ హరిప్రసాద్‌, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్‌ చైర్మన్‌ శ్రీనిరాజు తదితరులు పాల్గొన్నారు.