Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్గొండటౌన్: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)నిర్వహించిన ప్రజా దర్బార్ కు (Praja Durbar) వినతులు వెలువత్తాయి. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాం పు కార్యాలయ సమీపంలో గల మున్సిపల్ పార్కులో (In the municipal park) మంత్రి మూడు గంటల పాటు ప్రజా దర్బారు నిర్వహించారు. నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గం లోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజే శారు.
ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా విన్న మంత్రి కొన్ని సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీ (guarantee)ఇచ్చారు. అదేవిధంగా కొంతమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, వివిధ శాఖల అధికా రులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నా రు.