Revanth Reddy: ప్రజా దీవెన, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో బీఆర్ఎస్ (brs) బలహీనపడి నప్పుడల్లా అమాయక పిల్లలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించడం ద్వారా బలిచేస్తున్నారని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శవాల మీద రాజకీయం చేసి పబ్బం గడు పుకోవడం కేసీఆర్‌కు అలవాటని, వెన్నతో పెట్టిన విద్య అని మండిప డ్డారు. తమను కాపాడమని కేటీ ఆర్, హరీశ్‌లు ఢిల్లీలో మోదీ చు ట్టూ తిరుగుతున్నారని, అయినా చేసిన తప్పులకు లెక్కలు చెప్పా ల్సిందేనని స్పష్టం చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలంటూ దళిత, గిరిజన విద్యార్థులతో (Dalit and tribal students) దీక్షలు చేయించ డం కాదు, బావబామ్మర్దులు హరీ శ్, కేటీఆర్ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ దీక్షకు కూర్చోవాల ని హితవు పలికారు. డీఎస్సీ వాయి దా పడడమో, వారి ప్రాణాలు పోవ డమో జరగాలి కాని డీఎస్సీ వాయి దా ఉద్యమం రూ.వందల కోట్లు సం పాదనకు కోచింగ్ సెంటర్లు, బీఆర్ఎ స్ నాయకులు చేస్తున్న కృత్రిమ ఉ ద్యమమని ఆరోపించారు.కోచింగ్ సెంటర్ల మాఫియా కోసం పరీక్షను రద్దు చేయడం కుదరదని కుండబ ద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. పదేపదే పరీక్షల రద్దు కోసం ప్రతిప క్షం కుట్ర చేస్తోందని విమర్శిస్తూ వాయిదాల డిమాండ్ వెనుక కోచిం గ్ సెంటర్ల కుట్ర కూడా ఉందని ఆరోపించారు. వాయిదాతో తనకు వచ్చే నష్టం ఏమీ లేదని లక్షలమంది నిరుద్యోగులు నష్టపోతారని పేర్కొ న్నారు. డీఎస్సీ ద్వారా 11,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ప్రతి తల మాసినోడు వచ్చి వాయిదా వేయాలంటున్నారని విమర్శిం చారు.
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ (revanth reddy)కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్య కర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతుండడంపై పార్టీ ఫిరాయింపులంటూ బీఆర్ఎస్ అధి నేత కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, పదేళ్లలో బీఆర్ ఎస్ ఇదే పద్ధతిన కాంగ్రెస్ సభ్యుల ను చేర్చుకోలేదా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు ఇదంతా ఏమైందని, ఆయన వరకు వస్తే కానీ, బాధ తెలియలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ కలి సి కాంగ్రెస్ (congress) ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేయలేదా ఈ సర్కారు నెల రోజుల్లో కూలుతుందని కేసీఆర్ అనలేదా అని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ సుస్థిరత కోసం చేరికలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రాభి వృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని, లేక పోతే ఫామ్‌హౌజ్‌లో పడుకోవాలని, కాళ్లలో కట్టె పెడితే వీపు విమానం మోత మోగుతుందని కేసీఆర్‌ను హెచ్చరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad by-election) కాంగ్రెస్‌కు 3 వేల ఓట్లు వచ్చినప్పుడు పార్టీ, రేవం త్‌రెడ్డి పని అయిపోయిందని శునకానందం పొందారు. కానీ, 1.50 శాతం ఓట్ల నుంచి 40 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చాం. కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని ఆ రోజే చెప్పాం. వారి ఉసురు తగిలి మట్టికొట్టుకుపోయారు. ఇక బీఆర్ఎస్కు మనుగడ ఉండదు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌ది (congress) అన్యాయం అంటున్నారు. పదేళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను కొట్టి, చంపి జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ రాజ నీతి ఎక్కడికి పోయింది మేం అక్ర మ కేసులు పెట్టడం లేదు. కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగని రేవంత్ అన్నారు. రైతు రుణమాఫీ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పద వుల్లో ప్రాధాన్యత ఉంటుందని భరో సా ఇచ్చారు. త్వరలోనే కొత్త పీసీసీ (pcc)ఏర్పాటవుతుందని, అనంతరం అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియ మిస్తామని తెలిపారు. కార్యకర్తల కష్టంతోనే ఎమ్మెల్యేలు గెలిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం ఎమ్మెల్యేలు వారికం టే ఎక్కువ కష్టపడాలని రేవంత్ సూ చించారు. తనకు సీఎం పదవి నా యకుల వల్ల రాలేదని, కార్యకర్తల కష్టంతో వచ్చిందన్నారు. 35 మంది కి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని, నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి సమన్వ య సమావేశాలు ఏర్పాటు చేసుకో వాలని, ఇన్చార్జి మంత్రులతో కలిసి పనులు చేసుకోవాలని సూచిం చారు.