–అలాంటప్పుడే అభ్యర్థులకు న్యాయం
–టీజీపీఎస్సీ కమిషనర్‌ను కోరిన
కోదండరాం, హరగోపాల్
DSC, Group-2:ప్రజా దీవెన, హైదరాబాద్: డీఎస్సీ, గ్రూప్–2 (DSC, Group-2)పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా చూడాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డిని (GPSC Chairman Mahender Reddy) టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. అప్పుడే అభ్యర్థులకు న్యాయం జరుగు తుందన్నారు. డీఎస్సీ వాయిదా కోసం ఆందోళనల నేపథ్యంలో మంగళవారం కోదండరాం, హరగో పాల్ మహేందర్‌రెడ్డిని కలిశారు. ఆ వివరాలను కోదండరాం ఓ ప్రకటన లో వెల్లడించారు. పోటీ పరీక్షల అభ్యర్థులు (Candidates of Competitive Exams) ఎదుర్కొంటున్న సమస్యలను తాను, హరగోపాల్.. కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
పోస్టులు మళ్లీ వస్తాయో రావోనని వారిలో నెలకొన్న భయాన్ని, ఇప్పు డున్న పరిస్థితుల్లో పరీక్ష రాయడాని కి ఉన్న ఇబ్బందులను చెప్పినట్లు తెలిపారు. గ్రూప్–1 (group 1)పరీక్షలో నిష్పత్తిని 1:100కు పెంచాలని అభ్యర్థులు అడిగిన విషయాన్నీ చైర్మన్ దృష్టికి తెచ్చారని, పెంచడానికి గల అవకాశాలు పరిశీలించాలని గట్టిగా కోరారని వెల్లడించారు. హరగోపాల్‌తో (Haragopal) పాటు తానూ ఈ విషయాలపై మాట్లా డానన్నారు. దీనిపై కూలంకుషంగా చర్చించి.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తమకు చెప్పారన్నారు. విద్యార్థి, నిరుద్యో గుల సమస్యలపై తాము క్రియాశీల కంగానే స్పందిస్తున్నామని, సమస్య ల స్వభావం తీవ్రతనుబట్టి ఎప్పటి కప్పుడు స్పందిస్తూనే ఉన్నామని చెప్పారు.