–ఉమ్మడి జల్లాల వారీగా నేటి నుంచి సమావేశాలు
— మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు కోసం, విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయం
–23వ తేదీ వరకు జిల్లాల్లో పర్య టించనున్న భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధివిధానాలను రూపొం దించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేతృత్వం లోని మంత్రివర్గ ఉపసంఘం బుధ వారం నుంచి ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలు సుకోనుంది. భట్టితో పాటు మంత్రి వర్గ ఉపసంఘంలోని (Cabinet Subcommittee) సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఈ నెల 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వ హించే ప్రజాభిప్రాయ సదస్సుల్లో పాల్గొననున్నారు. వర్క్‌షాప్‌ల నిర్వ హణపై భట్టి విక్రమార్క మంగళ వారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రైతుభరోసా పథకం (Rythu Bharosa Scheme) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంద న్నారు. అన్ని జిల్లాల్లో అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు వర్క్‌షాప్‌లు (Workshop) నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన అభిప్రా యాలను క్రోడీకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. తొలి వర్క్‌షాప్ (Workshop) ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనుంది. ఆ తర్వాత 11వ తేదీన ఆదిలాబాద్, 12న మహబూబ్‌నగర్, 15న వరంగల్, 16న మెదక్,18ననిజామాబాద్, 19 న కరీంనగర్,22న నల్లగొండ, చివరగా రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 23న వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు.