Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PMJAY: ప్రజలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్..?

PMJAY: ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ (budget)(బడ్జెట్ 2024)ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. ఈ సాధారణ బడ్జెట్‌ను (budget) నెల 23న కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోంది. సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో పథకాలు అందేలా, అలాగే ఇప్పటికే ఉన్న పథకాలకు సంబంధించి బడ్జెట్ పెంచేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.. ఈసారి దేశంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్ ను ప్రవేశపెడుతుందని ప్రజలు భావిస్తున్నారు. 2024-25 రాబోయే బడ్జెట్ లో సామాన్యులకు ఊరట కలిగించేలా కేంద్రం (central)కీలక అంశాలతో పూర్తి స్థాయిలో బడ్జెట్ ను రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఆదాయ పన్ను పరిమితితో పాటు.. సంక్షేమ, ఆరోగ్య సంరక్షణకు (Welfare and health care) విషయంలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్‌లో (budget) ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY), ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం రాబోతున్నట్లు భావిస్తున్నారు. 2024 బడ్జెట్‌లో ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై పథకం కింద అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేయాలని ఆలచనలో ఉన్నటు తెలుస్తుంది.

ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (Arogya Yojana లబ్ధిదారుల సంఖ్య, బీమా మొత్తం రెండింటినీ పెంచే ఆలోచనలో ఉన్నటు తెలుస్తుంది.. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే కవరేజీ పరిమితిని ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచే అవకాశం ఉన్నటు సమాచారం. అంతేకాకుండా రాబోయే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది. కరాబోయే మూడేళ్లలో AB-PMJAY కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే, దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి పైగా ఆరోగ్య భద్రతను సులువుగా పొందగలుగుతారు. కుటుంబాలు అప్పుల ఊబిలోకి నెట్టే విషయాల్లో వైద్యం కోసం భారీగా ఖర్చు చేయడం కూడా ఒక ప్రధాన కారణమని ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని నివేదికలోని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ యోజన కవరేజీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ఖరారు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు ఉన్నటు తెలుస్తుంది.

ఇక వాస్తవానికి 2018 సంవత్సరంలో ఆయుష్మాన్ భారత్-PMJAY కోసంరూ. 5 లక్షల పరిమితిని నిర్ణయించింది.. ఇప్పుడు, ద్రవ్యోల్బణం, మార్పిడితో సహా ఇతర ఖరీదైన చికిత్సల విషయంలో కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి, ఈ పథకం కింద అందుబాటులో ఉన్న కవరేజీ పరిమితిని రెట్టింపు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జూన్ 27న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ పథకం కింద వర్తిస్తుందని, వారికి ఉచిత చికిత్స సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. దీంతో ఖరీదైన చికిత్స నుండి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఇప్పటికే.. ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) పథకం కింద 13.5 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. అలాగే 32.4 కోట్ల మందికి కార్డులు ఉన్నట్టు సమాచారం.