Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sweetness for the kitchen..! వంటింటికి తీపికబురు..!

-- భువికి దిగొచ్చిన వంట నూనెలు -- సామాన్య ప్రజలకు బడ్జెట్ ఊరట -- క్రూడాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నేపథ్యం

వంటింటికి తీపికబురు..!

— భువికి దిగొచ్చిన వంట నూనెలు
— సామాన్య ప్రజలకు బడ్జెట్ ఊరట
— క్రూడాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నేపథ్యం

ప్రజా దీవెన /న్యూ ఢిల్లీ: దేశంలో వంట గది బడ్జెట్ గణనీయంగా తగ్గే శుభ పరిణామ పరిస్ధితులు వచ్చేశాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా క్రూడాయిల్(crudaiol) దిగుమతి సుంకం అధీనంలోకి రావడంతో భారత దేశంలోని వంటింటి మహారాణులకు తీపి కబురు అందింది.

దేశంలో వంట నూనె ధరలు భారీగా దిగి రావడంతో సామాన్యులకు(common people) ఇది ఊరట కలిగించే అంశంగా పరిగణించవచ్చు. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ (Oils) వంటి వాటి ధరలు చెప్పుకోదగ్గట్టుగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నేపద్యంలో వంట నూనె (దీంతో వంట నూనె దీంతో వంట నూనె (Cooking oils) కొనుగోలు దారులకు తీపికబురు ఆనందాన్ని (happyness) కలిగిస్తుంది.

సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు ఏకంగా 29 శాతం మేర తగ్గింది. అలాగే సోయాబీన్ ఆయిల్ రేటు 19 శాతం దిగి వచ్చింది. ఇక పామోలిన్ ఆయిల్ రేటు 25 శాతం మేర క్షీణించింది. గత ఏడాది కాలంలో ఆయిల్ రేట్లు ఈ మేరకు దిగి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం(union government) తీసుకున్న పలు చర్యలు కారణంగా, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో వంట రూనె ధరలు భారీగా దిగి రావడం వంటి అంశాల నేపథ్యంలో దేశంలో ఆయిల్ రేట్లు(oils rate)భారీగా దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు.

ఇదిలా వుంటే కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలను నిశితంగా గమనిస్తూ వస్తోందని, అంతర్జాతయ మార్కెట్‌ (international market) లో రేట్ల తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు పూర్తిగా అందేలా పని చేస్తోందని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్వయంగా వివరించారు.

కాగా కేంద్ర ప్రభుత్వం దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు తక్కువ స్థాయిలో ఉంచటానికి గత రెండేళ్ల కాలంలో క్రూడ్, రిఫైన్డ్ ఆయిల్స్ దిగుమతులపై సుంకాల (Duties on imports)ను పలు మార్లు తగ్గించడంతో కూడా రేట్లు దిగి వచ్చాయని వెల్లడవుతోంది.