–సమర్థవంతమైన వివాద రహిత నేత కోసం ఆరాతీస్తున్న అధిష్టానం
–తెలంగాణలో క్షేత్రస్థాయి బలోపే తం కోసం బలమైన లక్ష్యం
–నెలాఖరుకల్లా సరికొత్త సారధి కి బాధ్యతల అప్పగించే అవకాశం
–దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు మార్పు అనివార్యం
BJP: ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణ కమలం పార్టీ (Lotus party) రథసారథి ఎంపిక విషయంలో బిజెపి (bjp)అధిష్టానం ము మ్మర కసరత్తులో మునిగితేలుతోo ది. సమర్థవంతమైన వివాదరహిత నేత కోసం మేధోమధనం చేస్తుంది ఆ పార్టీ నాయకత్వం. రాష్ట్ర పార్టీని ఒంటి చేత్తో నడిపే బలమైన నాయ కత్వ లక్షణాలు కలిగిన నాయకున్ని ఎంపిక చేయాలని ప్రతి కొంత కాలం గా సమలోచనలు చేస్తున్న బిజెపి అధిష్టానం కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి (Minister Kishan Reddy)స్థానంలో ఎవరికి రాష్ట్ర పార్టీ బాధ్య తల పగ్గాలు అప్పగించాలని తీవ్రం గా చర్చలు చేస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై కసరత్తు అం తా అనుకున్నట్టు జరిగితే ఈ నెలా ఖరుకే కొత్త సారథికి పగ్గాలు అప్ప గించే ఛాన్స్ కనిపిస్తోంది. అందరి కంటే ముందు రేసులో ఎంపీ ఈట ల రాజేందర్ ఉన్నా ఆయనకు ర ఘునందన్, ధర్మపురి అర్వింద్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ముగ్గురిలోనే ఒకరికి ఛాన్స్ దక్కుతుం దని ప్రచారం జరుగుతున్న టైమ్ లో ఎవరికివారు తమ బలాబ లాల ను హైకమాండ్ ముందు ఉంచు తున్నారు.
ఇప్పటికే తెలంగాణలో బీజేపీ (bjp) తన ఉనికిని క్రమంగా విస్తరి స్తూ వచ్చింది. ఎన్నికలు ఏవైనా కమల వికాసం ఖాయం అనేలా తన కేడర్ ను బలపరుచుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఒక బల మైన దిశానిర్దేశం చేసే నాయకుడు ఉండాలని భావిస్తోంది. అయితే కొత్త జాతీయ అధ్యక్షుడి నియామ కం ఆలస్యమ వుతుండడంతో పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పు పై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. హర్యానా ఎన్నికల నేపథ్యంలో ముందుగా అక్కడ బీజేపీ (bjp)చీఫ్‌ను ప్రకటించారు. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా మోహన్‌లాల్ బడోలీకి బాధ్యతలు అప్పగించారు.
త్వరలోనే తెలంగాణ సహా మరికొ న్ని రాష్ట్రాల్లోనూ అధ్యక్ష మార్పు లు ఉంటాయని తెలుస్తోంది. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లో ఉన్న నేప థ్యంలో.. వీలైనంత త్వరగా అధ్యక్ష బాధ్యతల్ని మరొకరికి అప్పగించేలా కసరత్తు జరుగుతోంది. గతంలో బండి సంజయ్ కు ఇచ్చిన తరుణంలో తిరిగి ఆయనకే ఆధ్యక్షుడి పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ ఓ వర్గంలో జరుగుతోంది. అయితే ఆయనకు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పదవి దక్కే అవకాశాలు కనపించడం లేదు. దీనికి కారణం ఆయనను కూడా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి వరించడమే. దీంతో ఇక మిగిలింది ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్. ఈ ముగ్గురిలో ఈటలకు అవకాశాలు అధికంగా ఉండటానికి కారణం రాష్ట్రంలో సీనియర్ నేత (Senior leader), బీఆర్ఎస్ లో (brs)ఉండి అక్కడి పరిస్థితులు కేసీఆర్ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఆయనకే రాష్ట్ర అధ్యక్షుడి పదవి దక్కుతుందని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా మరో 20 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త రథసారధి ఎవరనే ఉత్కంఠకు తెరతొలగనుంది.