Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: అధిక జనాభా వల్ల అనర్థాలు

–ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది
–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: అధిక జనాభా వల్ల కలిగే అనర్ధాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందని జిల్లా కలె క్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy)అన్నారు.ప్రపంచ జనాభా దినోత్సవం సంద ర్బంగా గురువారం జిల్లా వైద్య ఆరో గ్యశాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్ట ణంలోని క్లాక్ టవర్ చౌరస్తా (Clock Tower Square) వద్ద నుండి డిఎంహెచ్ఓ కార్యాలయం (DMHO Office) వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన జండా ఊపి ప్రారంభించా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక జనాభా వల్ల పేదరికం, నిరక్షరా స్యత, వనరుల లేమీ వంటివి ఏర్పడతాయని అ న్నారు. సహజ వనరులు స్థిరంగా ఉంటాయని, ఉన్న వాటిని తక్కువ జనాభాతో సరైన విధంగా వినియో గించుకోవచ్చని, ఒకవేళ జనాభా ఎక్కువైనట్లయితే వనరులు సరిపో క పేదరికం, నిరక్షరాస్యత వంటివి పెరిగిపో తాయని అన్నారు. అదే సమయంలో మానవుని జీవితంలో అన్ని విషయాలలో నాణ్యత అనేది తగ్గిపోతుందని చెప్పారు. అలా కాకుండా జనాభాను నియంత్రిస్తే నిరుద్యోగం, పేదరికం వంటివి ఉండవని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో చాలావరకు ఒకరు, ఇద్దరు పిల్లల తోనే సరిపెట్టుకుంటున్నారని, అందరూ కుటుంబ నియం త్రణ పద్ధతులు పాటిస్తున్నప్పటికీ ,ఈ విషయాన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. కుటుం బ నియంత్రణలో అనేక అధునాత న పద్ధతులు వచ్చాయని, వీటివల్ల తక్కువ రిస్క్ (risk) ఉంటుందని చెప్పా రు. తక్కువ జనాభాతో భవిష్యత్తు తరాల జీవితం బాగుంటుందని అన్నారు. జనాభా వల్ల కలిగే అనర్ధాలను (Anarchy) అందరికీ తెలియ జేయాల్సి న అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగో పాల్ రెడ్డి, డిఎల్ఓ హరికృష్ణ, డిఐఓ పద్మ, ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి అరుంధతి, పిఓడిటి గీతావాణి, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, విద్యా ర్థులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.