–భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ ను పరిష్కరించాలి
–యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్ కోటం రాజు
CITU;ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ బోర్డు ద్వారా అమల వుతున్న సంక్షేమ పథకాల పెండింగ్ క్లెయిమ్స్ ను వెంటనే పరిష్కరించా లని,వెల్ఫేర్ బోర్డు నుండి దారి మళ్లిం చిన నిధులను వెంటనే బోర్డులో జమ చేయాలని తెలం గాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) (CITU)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కోటంరాజు ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. గురు వారం దొడ్డి కొమరయ్య భవన్ లో తెలంగాణ బిల్డింగ్ (Telangana Building) అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) నల్లగొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షు లు కంచి కేశవులు అధ్యక్ష తన జరి గింది. ఈ సమావేశానికి ముఖ్యఅతి థిగా హాజరైన కోటం రాజు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మి కుల పోరాట ఫలితంగా సాధించు కున్న తెలంగాణ వెల్ఫేర్ బోర్డు (Telangana Welfare Board) నిధుల ను ఇప్పుడున్న చట్టం ప్రకారం కార్మికులకు అమలు చేస్తున్న క్లెయిమ్స్ రాష్ట్రవ్యాప్తంగా 33,683 పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకుపోయిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏ ఎల్ ఓ, ఏ సి ఎల్, డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ బోర్డు (Welfare Board)లో ఉన్న 5500 కోట్ల రూపాయల నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా వైద్య పరీక్ష లు,ట్రైనింగ్ లు, ఆఫీసు సుందరీ కరణ పేరుతో దుబార చేస్తున్నారని ఇది ఆపకపోతే కార్మికులను (workers)సమీక రించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ (CH Lakshminarayana) మాట్లా డుతూ సంక్షేమ బోర్డులో వేల కోట్ల రూపాయల నిధులు ఉన్న కార్మికుల కు ఇస్తున్న నష్టపరిహారాలను పెం చడంలో అధికారులు సవిత తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించా రు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ ని కార్మిక సంఘాల ప్రతినిధులతో వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు బోర్డులో రిజిస్టర్ అయ్యేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాటులను కూడా బోర్డు కొచ్చి సరి చేసుకోవా లని చెప్పడం కార్మికుల సమయాన్ని వృధా చేయడమేనని ఆ అధికారా న్ని ఎఎల్వో లకు ఇవ్వాలని కోరా రు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు అద్దంకి నర సింహ, ఎస్ సైదాచారి, పోలే సత్య నారాయణ, వరికుప్పల ముత్యా లు, కట్టబక్కయ్య, బి వెం కటయ్య, గుండ్ల వెంకన్న, రాములు, వెంకట్ రాములు, సిహెచ్ స్వామి, శ్రీను ముత్యాలు తదితరులు పాల్గొ న్నారు.