Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తాం

–ఒడిస్సా సీఎం మొహన్ చరణ్ మాంజీ
–సత్వరమే చర్యలు చేపట్టండo టూ అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు
–డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వినతికి స్పందించిన ఒడిస్సా సీఎం

Bhatti Vikramarka: ప్రజా దీవెన ఒరిస్సా: ఒరిస్సా లోని నైనీ బొగ్గు గనుల (Naini Coal Mines) తవ్వకానికి పూర్తి గా సహకరిస్తామని ఒడిస్సా ముఖ్య మంత్రి భరోసా ఇచ్చారు. స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ఉన్న తాధికారులకు వెనువెంటనే ఆదే శాలు జారీ చేశారు. 2015లో సింగ రేణి (Singa Reni)కేటాయించిన ఒరిస్సా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గను ల్లో తవ్వకాలు చేపట్టడానికి సహక రించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు ఒడిస్సా సీఎంను (CM of Odisha) కోరగా ఆయన వెంటనే స్పందించారు. నైని బ్లాక్ లో సింగ రేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరెందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారుల బృందంతో కలిసి ఒడిస్సా సీఎంను ఆ రాష్ట్ర సచివాలయంలో కలిశా రు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)సింగరేణికి బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను వివరించారు.

2017 లోనే సింగరేణికి (Singa Reni) నైని గనుల ను కేటాయించారు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. నాడు అందచేసిన వినతి పత్రాల ను అందజేశారు. తాడిచర్ల బ్లాక్, నైని బ్లాక్ (Tadicharla Block, Naini Block)లకు సంబంధించిన అడ్డంకులను తొలగించాల్సిందిగా గతంలోనే విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. నైనీ బ్లాకు లో గనుల తవ్వకానికి పారిశ్రామిక, పర్యావరణ అనుమతులు సైతం వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒడిస్సా సీఎంకు వివరించారు. అటవీ, ప్రైవేటు భూములను సింగరేణికి బదలాయించాల్సన అంశం పెండింగ్లో ఉంది, ఈ సమస్య పరిష్కారం అయితే సింగరేణి తవ్వకాలను ప్రారంభిస్తుందని వివరించారు. నైని బ్లాక్లో తవ్వకాలు చేపట్టడం మూలంగా ఒరిస్సా రాష్ట్ర యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి, పన్నుల రూపంలో 600 కోట్ల వరకు ఒరిస్సా సర్కార్ కు ఆదాయం సమకూరుతుందని వివరించారు.

దేశంలో విద్యుత్ సరఫరా (Power supply) సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వ సంస్థ సింగరేణి మనుగడకు నైనీ బొగ్గు గనులు అత్యంత ఆవశ్యకమని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన లేఖను ఒడిస్సా సీఎంకు అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విన్నపం తో ఒడిస్సా సీఎం వెంటనే స్పందించారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి బృందానికి స్పష్టం చేశారు. భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని స్థానికంగా ఉన్నత అధికారులకు ఒడిస్సా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి బలరాం నాయక్, ఇంధన శాఖ ఓఎస్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.