–రోజుకొకరి చొప్పున హస్తం గూటికి గులాబీ పార్టీ ఎమ్మెల్యే లు
— ఈ రోజు ఒకరు, రేపు మరొకరు మరో వారంలో మరో నలుగురు హస్తం గూటికి చేరే అవకాశం
— కారు పార్టీలో కేవలం ఉండేది కేవలం నలుగురు మాత్రమే
–తెలంగాణ లో కేసీఆర్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్
BRS:ప్రజా దీవెన, హైదరాబాద్: అతిత్ రలో బీఆర్ఎస్ (brs) పార్టీకి చెందిన ఆరు గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని ఆ తర్వా త బీఆర్ఎస్ ఎల్పీ (బీఆర్ఎస్ లెజిస్లేటివ్) పార్టీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుం దని ఎమ్మెల్యే దానం నాగేందర్ (Daana Nagender) సంచలన కామెంట్స్ చేశారు. హైద రాబాద్ సిటీలో నేడు జరిగిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కేవలం నలుగురు ఎమ్మెల్యే లు మాత్రమే మిగులుతారని.. కేసీ ఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా (KCR, KTR, Harish Rao, Palla)మాత్రమే ఉంటారని మిగతా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం చేశారాయన.
ఇదే సందర్భం లో కేసీఆర్ (kcr)వ్యవహార శైలినీ తప్పు బట్టారు దానం. కనీసం ఎమ్మెల్యే లకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని, ప్రజాప్రతినిధులకు అందు బాటులో ఉండరని ఎప్పు డూ ఫాంహౌస్ లోనే ఉంటారంటూ చురకలు అంటించారు దానం. ఒక వేళ అపాయింట్ మెంట్ ఇచ్చినా గంటల తరబడి కేసీఆర్ (kcr)కోసం వెయిట్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛలేదని వ్యాఖ్యా నించారు. బీఆర్ఎస్ పార్టీ అధికా రంలో ఉన్నప్పుడు కేటీఆర్,(ktr) అతని అనుచరులు వేల కోట్ల రూపాయ లు దోచుకున్నారని ఆ వివరాలు అన్నీ బయట పెడతానని వెల్లడిం చారు. ఎమ్మెల్యేలను కాపాడుకు నేందుకే ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, బీ ఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అధికారం లోకి రాదన్నారు దానం, జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురా కుం డా రాజకీయం చేస్తున్నారని కావాల నే కవితను జైల్లోనే ఉంచుతున్నా రంటూ కేసీఆర్, కేటీఆర్ తీరును ప్రశ్నించారు దానం. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మూతపడు తుంద ని అది ఎంతో దూరంలో లేదని జో స్యం చెప్పారు.