Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalvakuntla kavitha: కవిత బెయిల్ పై ఆసక్తికర పరిణామం

Kalvakuntla kavitha: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ (CBI Supplementary Chargesheet, Default Bail) పిటిష న్లపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యా లతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీ ట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ రౌస్‌అవెన్యూ కోర్టు కు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవా లని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి కావేరి భవేజా తెలి పారు.సీబీఐ కేసు లో కవితకు డిఫా ల్ట్ బెయిల్‌పై విచారణ జరిపింది. సీబీఐ ఛార్జ్ షీట్‌లో తప్పులున్నా యని కవిత తరపు న్యా యవాది నితేష్ రానా న్యాయ స్థానానికి చె ప్పారు.

తప్పులు లేవని సీబీఐ (cbi)తర పు న్యాయవాది అన్నారు. ఛార్జ్‌షీ ట్‌లో తప్పులున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవే జా అడిగారు. ఛార్జ్‌షీట్‌లో (Charge sheet) తప్పు లున్నాయని కోర్ట్ ఆర్డర్ ఫైల్ చేయా లని జడ్జి కావేరి భవేజా చెప్పారు. కోర్ట్ ఆర్డర్ అప్ లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా (Nitesh Rana) అన్నారు. తదుపరి విచార ణను జూలై 22కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. డిఫాల్ట్ బెయిల్, ఛార్జ్‌షీట్‌లో తప్పులపై విచారణ జరిగేంత వరకు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలని న్యాయవాది నితేష్ రానా చెప్పారు. ఛార్జ్ షీట్‌ను (Charge sheet)పరిగణలోకి తీసుకునే అంశం కవిత డిఫాల్ట్ బెయిల్‌కి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. ఛార్జ్‌షీట్ పూర్తిగా లేదని వాదించడం లేదని.. తప్పుగా ఉందని చెబుతున్నానని నితేష్ రానా న్యాయస్థానానకి తెలిపారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం లోనే ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 16న ఢిల్లీ రౌస్‌ అవె న్యూ కోర్టులో సీబీఐ ఆమెను హాజరుపరిచింది. కవిత తిహాడ్‌ జైలులో ఉండగానే ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటిం చింది. ఆ తర్వాత కవిత బెయిల్‌ పిటిషన్‌ (Bail Petition) దాఖలు చేయగా రౌస్‌అ వెన్యూ కోర్టు తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును కవిత హైకోర్టులో సవాల్‌ చేశారు.