Pastor’s Fellowship:ప్రజా దీవెన, కోదాడ: శుక్రవారం పట్టణంలో జరిగిన నూతన కమిటీ ఎన్నికల్లో నియోజకవర్గ పాస్టర్ పెలోషిప్ (Pastor’s Fellowship) అధ్యక్షులు డాక్టర్ జే సుదర్శనం (Jay Sudarshanam)ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎలక్షన్ బోర్డు చైర్మన్ (Election Board Chairman)సాయిని. జాకబ్ ఒక ప్రకటనలు తెలిపారు. కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ గత కమిటీ కాలపరిమితి ముగియడంతో పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు కె. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ నూతన కమిటీ ఎన్నికను కోదాడ పట్టణంలోని బేతేలు గాస్పెల్ చర్చిలో నిర్వహించారు.
కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ వర్కింగ్ (Pastor’s Fellowship Working)ప్రెసిడెంట్ గా కె. జోసెఫ్, ప్రధాన కార్యదర్శిగా రూఫస్ నాయక్, ఉపాధ్యక్షులుగా రామారావు, షేక్ కోర్నెలి, జాయింట్ సెక్రటరీ బి. గాబ్రియేలు, ట్రెజరర్ పరంజ్యోతి, చీఫ్ కోఆర్డినేటర్ ఆర్. జోసెఫ్ రాజు, ఆర్గనైజర్ యేసుపాదం, గౌరవ సలహాదారులు ఆర్. ప్రకాష్, కోఆర్డినేటర్ జె. సామ్యేలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సంతోష్ పాల్, జాషువారాజు, వినోద్, జాన్ మహేందర్, డేవిడ్ సన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బిషప్ డాక్టర్ జె సుదర్శనం మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని పాస్టర్ల సంక్షేమం కొరకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, అన్ని మండలాల పాస్టర్లు పాల్గొన్నారు.