*పూర్తి వ్యాపార దృక్పథంతో కాక సేవా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి
*నాణ్యమైన వైద్య సేవలతో పేరు తెచ్చుకోవాలి .డాక్టర్ జాస్తి సుబ్బారావు
Jasti Subbarao:ప్రజా దీవెన, కోదాడ: నగరాలకు ధీటుగా కోదాడలో అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ స్థాయిలో (Corporate level)సంజీ వని న్యూరో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు (Jasti Subbarao)అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్ లో డాక్టర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ (Sanjeevani Neuro Super Specialty)వైద్యశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
వైద్య సేవలు (Medical services పూర్తి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. నాణ్యమైన వైద్య సేవలతో సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జూకురి అంజయ్య, కోదాడ మునిసిపల్ ఛైర్మన్ సామినేని ప్రమీల రమేశ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మహబూబ్ జానీ, గుండపనేని నాగేశ్వరరావు, బొలిశెట్టి కృష్ణ య్య, డా.ఈఎన్టీ ప్రసాద్, డా.రాఘవ రావు,తదితరులు పాల్గొన్నారు.