–ప్రజలు తమపై ఉంచిన నమ్మకా న్ని నిలబెట్టుకుంటాo
–నిస్పృహతో ఉన్న యువతకు భవిష్యత్ పై భరోసా కల్పించాం
–మీడియా సమావేశంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
YCP Land Acquisition:ప్రజా దీవెన, విశాఖ పట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు పరిపాలించిన వైసిపి భూ కబ్జాలపై (YCP Land Acquisition) అతిత్వర లో విశాఖ ఫైల్స్ విడుదల (Release of Visakha files)చేయబో తున్నామని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలి పారు. అదే సందర్భంలో ప్రజలు త మపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటామన్నారు. అధికారం లోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చిన విధం గానే అయిదు దస్త్రాలపై సం తకా లు చేసి చిత్తశుద్ధి నిరూపిం చుకు న్నామని చెప్పారు.ఎం.వి. పి.కాలనీ లోని తన నివాసంలో ఆదివారం జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా డుతూ అయిదేళ్లు గా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగక నిస్పృహతో ఉన్న యువతకు భవిష్యత్ పై భరో సా కల్పించేలా 16,347 పోస్టుల తో మెగా డీఎస్సీ (dsc) ప్రకటించామని, సామాన్యులను సైతం భయబ్రాం తులకు గురి చేసిన ల్యాండ్ టైట లింగ్ యాక్టును రద్దు చేశామన్నా రు.
అన్నమాట ప్రకారం పెంచిన పెన్షన్ ఎరియర్స్ (Pension arrears) తో కలిపి జులైలో రూ.7 వేలు చెల్లించామని, ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 183 అన్న క్యాంటీన్ లను పునరుద్ధరి స్తున్నా మని వెల్లడించారు.వైసీపీ ప్రభు త్వంలో స్టీల్, సిమెంట్ కంటే ప్రియ మైపోయిన ఇసుక ధరలకు కళ్లె మేస్తూ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక (free sand) విధానాన్ని తీసుకువ చ్చిం దని తెలిపారు. గడిచిన అయి దేళ్లలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయని, స్కూల్ పిల్లలు సైతం గంజాయికి బానిసలైపోవడం కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ముఖ్య మంత్రి అదేశించారన్నారు.
ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును (Visakha Steel) ప్రైవేటు పరం కాకుండా కూటమి ప్రభుత్వం ఆపగలిగిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ (Visakha Railway Zone)పనులు, 70 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు, జాతీయ రహదా రుల విస్తరణ వంటి పనులను కేం ద్రం నుంచి తెచ్చుకున్నామని తెలి పారు.ఆంధ్రుల కలల రాజధాని అమ రావతిని జగన్మోహన్ రెడ్డి స్మశానంగా మార్చారని గంటా విమ ర్శించారు. 2014-2019 లో 72 శాతం పోలవరం పనులు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రుల జీవనాడిగా పేర్కొనే ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి విదేశీ నిపుణులను తీసుకు వచ్చారని ఆయన చెప్పా రు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పథకం అందుతుందని, నకిలీ జీఓ లతో వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ అబ్ది దారులను గందరగోళానికి గురి చేస్తోందని మండిపడ్డారు. హైదారా బాద్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport)లా విశాఖ అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్టు గ్రోత్ ఇంజన్ లా పని చేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో సీఎం హోదాలో జగ న్మోహన్ రెడ్డి హెలికాప్టర్ మీద వెళ్లి నా రోడ్డు మీద ట్రాఫిక్ నిలిపివేసే వారని, షాపులు మూయించేసేవా రన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రోటోకాల్ తో ప్రజలను, ట్రాఫిక్ ను ఇబ్బంది పెట్టొ ద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.