Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleshwaram project:ఉన్నతస్థాయి ఉత్తర్వులు అమలు చేయడమే మా విధి..!

–జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు ఐఏ ఎస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారుల వివరణ
–మీరు చెప్పినదంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండన్న కమీ షన్

Kaleshwaram project:ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) నిర్మాణం, అంచనాల సవరణ, టెండర్ల ప్రక్రియలో తమ పాత్రేమీ లేదని ఐఏఎస్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు (IAS officers)స్పష్టం చేశా రు. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అమలు చేశామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మా ణాల్లో లోపాలు, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఎదుట సోమవారం ఆయా సీనియర్‌ ఐఏ ఎస్‌లు, విశ్రాంత ఐఏఎస్‌లు హాజ రయ్యారు. మాజీ సీఎస్‌ శైలేంద్రకు (CS Shailendra)మార్‌ జోషి ఆన్‌లైన్‌లో, మాజీ సీఎ స్‌ సోమేశ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి రజత్‌కుమార్‌, ముఖ్యకార్యద ర్శి వికాస్‌రాజ్‌, నీటిపారుదల శాఖ ప్రస్తుత కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి కె.రామకృష్ణారావు, మాజీ సీఎం కేసీఆర్‌కు పదేళ్లు కార్యద ర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరై, వాదనలు విని పించారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంvతాల ఎంపిక, నిర్మాణంలో మీ పాత్ర ఏంటి అని కమిషన్‌ ఆరా తీసింది.

బ్యారేజీల నిర్మాణానికి (Construction of barrages)పరిపాలనాపరమైన అనుమతులు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిన తీరు, వారితో చేసుకున్న ఒప్పం దాలు, వాటి అమలు,అంచనాల సవరణ, ఉల్లంఘనలు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల (Engineers, construction companies) ప్రతి నిధులను విచారించి, ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా ఐఏఎస్‌, మాజీ ఐఏఎస్‌ అధికారు లపై (IAS officers) కమిషన్‌ ప్రశ్నల వర్షం కురిపిం చినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపైనా లోతుగా విచారించినట్లు సమాచారం. అంచ నా వ్యయ ఆమోదం, పరిపాలనా అనుమతులు, సవరణ అంచ నాలు, నిధుల విడుదల, కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అనుమతులు, దాని ద్వారా రుణా లు సమీకరించిన తీరు తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఏ నిర్ణయం కూడా తాము తీసుకోలేదని, అన్నీ ఉన్న తస్థాయిలోనే జరిగాయని అధికా రులు తెలిపినట్లు సమాచారం.

ఉన్నతస్థాయిలో జరిగిన నిర్ణయాలనే అమలు చేశామని, బ్యారేజీల నిర్మాణం, వైఫల్యం, అంచనాల సవరణతో తమకెలాంటి ప్రత్యక్ష సంబంధాల్లేవని వారు వివరిం చినట్లు తెలిసింది. ఇక కమిషన్‌కు నివేదించిన అంశాలను అఫిడవిట్ల రూపంలో వారంలోగా సమర్పించా లని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. ఆర్థిక శాఖ (Department of Finance)ప్రత్యేక ప్రధాన కార్య దర్శి కె.రామకృష్ణారావు రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీలో నిమగ్నమై ఉండడంతో ఆయనకు ఆగస్టు 5వరకు గడువు ఇచ్చారు. కాగా, విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ఐఏ ఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే జోషి పనిచేశారు. ఆ తర్వాత మూడేళ్లకు పైగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శిగా రజత్‌కుమార్‌ వ్యవహరిం చారు. సోమేశ్‌కుమార్‌, వికాస్‌రాజ్‌ (Someshkumar, Vikasraj) కొంత కాలం ఆశాఖ కార్యదర్శు లుగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వ ర్తించారు. మాజీ సీఎం కేసీఆర్‌ కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పర్యవే క్షించారు. దాంతో వీరిని కమిషన్‌ విచారించింది. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అనుమ తుల జారీ, రుణాల సమీకరణ, వినియోగం, బడ్జెట్‌ నిధుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్‌ విచారించింది. విశ్రాం త ఐఏఎస్‌ వి.నాగిరెడ్డిని సైతం ఇదే వ్యవ హారంలో ప్రశ్నించడానికి కమిషన్‌ రమ్మని కోరగా, ఆయన నుంచి స్పందన రాలేదని తెలిసింది. సోమవారం విచారణలో ఇతర అధికారులు కూడా అఫిడవిట్లు దాఖలు చేశారు.