–రైతులకు సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
–సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులు పంట రుణాలను ఆగస్టు 15 లోగా మాఫీ చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)పునరుద్ఘాటించారు. సోమవారం తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Telangana State Seeds Development Corporation Limited) చైర్మన్ గా ఎస్ అన్వేష్ రెడ్డి బాధ్య తలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అప్పుల బాధ నుంచి విముక్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో పంట రుణాలను మాఫీ చేస్తుంద న్నారు. పంట రుణాల మాఫీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంద న్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిం చిన విధంగా ఆగస్టు 15 లోగా పంట రుణా లను మాఫీ చేస్తామని చెప్పారు. రైతుల ఆర్థిక సాధికా రత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంద న్నారు.
తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైతు భరోసా (rytu barosa)పథకాన్ని ప్రారంభించా మని, ఇది రైతులందరికీ ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి మద్దతుని స్తుందన్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్త మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షకోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరందించలేకపో యిందని ఉత్తమ్ కుమార్ రెడి మండిపడ్డారు. కాంగ్రెస్ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కా రాలు, స్పష్టమైన ఫలితా లపై దృష్టి సారిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాం లోనకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుం దన్నారు. పంట రుణాల మాఫీస హాపలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమా వేశంలో చర్చిస్తా మని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు.