–కలెక్టర్ ల సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
–ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సా మాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలి
–క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి, కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదు
— మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వ మని ప్రజలకు తెలిసేలా ఉండాలి
–ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి
— కలెక్టర్లు విధిగా క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో అన్ని జిల్లాల వారీగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా మాన వీయ కోణంలో కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పని చేయాలన్నారు. మంగళవారం సచి వాలయంలో జిల్లా కలెక్టర్లతో ప్రారం భమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో హాజరైన ఉప ముఖ్య మంత్రి భట్టివిక్రమార్క (Bhattivikramarka), మంత్రులు, ప్రభుత్వ సల హాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషన్లర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు.ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై సమావేశంలో చర్చ జరిగింది. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసు కోవాలనీ, కేవలం ఏసీ గదులకే పరి మితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని హితవు పలికారు. కలెక్ట ర్లుగా మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభు త్వమని ప్రజల కళ్ళల్లో ప్రతిబిం బించేలా ఉండా లని పేర్కొన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని, కలెక్టర్లు విధిగా క్షేత్రస్ధాయిలో పర్య టించాల్సిందేనంటూ ఆదేశించారు.
సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ (Balance welfare and development)చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు.ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోందని, తెలంగాణ పునర్నిర్మా ణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీల కమైందని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్య వేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆకాక్షించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందిం చారని, కలెక్టర్లు బదిలీ (Transfer of Collectors) అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలని సూచించారు. ప్రజావాణి సమ స్యలను ఎప్పటికప్పుడు పరిష్క రించాలని, ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందని, ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని కోరారు.డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని, ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని గుర్తు చేశారు.
ఎన్నికల కోడ్ (Election Code)ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే నంటూ పేర్కొ న్నారు. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారని, తెలం గాణ సంస్కృతిలో భాగస్వామ్య మై తేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని తెలిపారు. తెలంగాణను (telangana) మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని అప్పిలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్కమల్లు మాట్లాడుతూ విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కోరారు.ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అన్న సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు.అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయికి తీసుకెళ్లి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలనని పిలుపుని చ్చారు. కలెక్టర్లు విస్తృతంగా క్షేత్ర స్థాయిలో (Collectors are widely field level) పర్యటనలు చేసి, సమ స్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు (Bhatti Vikramarkamallu)అన్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని రైతు భరోసా కార్య క్రమంలో భాగంగా మేము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరి మితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచా రం చేయాలని, అర్హులందరికీ అవి అందేలా చూడాలని ఆదేశించారు. ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం కొనసాగుతుంది అన్న సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తే పలు సమ స్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని వివరించారు.