Hero Suriya : చాలా మంది అభిమానులు వారి హీరో, హీరోయిన్ల పుట్టినరోజులు వస్తున్నాయి అంటే వాళ్ల కటౌట్స్ కి పాలాభిషేకాలు, పులాభిషేకాలు, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదాన శిబిరాన్ని (Blood donation camp) ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అభిమానులతో కలిసి హీరో సూర్య కూడా రక్తం ఇచ్చి గొప్ప మనసు సొంతం చేసుకున్నాడు. అయితే సూర్య పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి జూలై 23 వరకు తమిళనాడు రాష్ట్రంలో మొత్తం కూడా ఈ రక్తదాన శిబిరాలు (Blood donation camp)కొనసాగుతున్నాయి.
ఇక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా సూర్య బర్త్డే రోజు (Surya’s birthday) ఇలా జరిపిస్తూ ఉంటారు అక్కడి అభిమానులు. అంతేకాకుండా ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలాగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తాన్ని కూడా అందుబాటులోకి ఉంచుతారు. సూర్య పుట్టినరోజు(Surya’s birthday) సందర్భంగా గత సంవత్సరం సుమారు 2000 మంది పైగా అభిమానులు రక్తదానం చేశారంటే నమ్మండి. ఇక ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య ఆ సమయంలో వీడియో కాల్ (video call) చేసి అభిమానులతో మాట్లాడి వారిని అభిమానించారు. అంతేకాకుండా ఆ సమయంలో వచ్చే ఏడాది నిర్వహించే రక్త దాన శిబిరానికి (Blood donation camp) నేను హాజరు అవుతానని ఆయన తెలిపాడు
అయితే ప్రస్తుతం హీరో సూర్య (hero surya) ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేడు రక్తదాన శిబిరాన్ని కి వెళ్లడం. హీరో సూర్య కూడా రక్తదానం ఇవ్వడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోను చూసిన కొంతమందిని నెటిజన్స్ సూర్య తో పాటు అతని అభిమానులపై ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం హీరో సూర్య (hero surya) సినిమాల విషయానికి వస్తే కంగువ చిత్రం అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి అభిమానులలో. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. దీంతోపాటు వాడీ వసూల్ సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది.
Chief @Suriya_offl has donated blood today with fans as promised ❤️#BloodDonation #Kanguva pic.twitter.com/FQd9xWLUSd
— Suriya Fans Club (@SuriyaFansClub) July 15, 2024