–విచారణ కొనసాగుతుండగా హద్దుదాటి వ్యవహరించారు
–తక్షణమే ఆయనను మార్చాలం టూ ప్రభుత్వానికి ఆదేశం
–కెసిఆర్ పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం
–సుప్రీంకోర్టులో మాజీ సిఎం కు భారీ ఉపశమనం
Justice Narasimha Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ (Electricity Commission)చైర్మన్ జస్టిస్ నర సింహారెడ్డి వ్యవహార శైలిపై సుప్రీం కోర్టు అసహన వ్యక్తం చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి (Justice Narasimha Reddy)కమిషన్ విచారణ కొనసాగుతుండగా ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడిం చడం తీవ్ర అభ్యంత రకరమని వ్యాఖ్యానించింది. ఆయనను తక్షణమే మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సీఐజే (cij)నేతృత్వంలోని ధ ర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసిం ది. తెలంగాణలో రేవంత్ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీ ఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం నేడు విచారిం చింది. ఈ క్రమంలో కేసీఆర్ తరఫు న ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ తమ వాదనలు విని పించారు.
సుప్రీంకోర్టులో కేసీఆర్ (KCR in the Supreme Court) పిటిషన్‌పై హోరాహోరీగా వాదనలు జరిగాయి. అనంతరం సీజేఐ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ (Electricity Commission) చైర్మన్‌ను మార్చా లని ఆదేశాల్లో స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ తీరుపై సీజేఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. జూన్ 11న విచారణ పూర్తి కాక ముందే కమిషన్ చైర్మన్ తన అభి ప్రాయం చెప్పేశారని సీఐజే వ్యాఖ్యా నించారు. జడ్జి (judge) నిస్పక్షపాతంగా ఉండాలని, కమిషన్ చైర్మన్ ను మా ర్చే అవకాశం ఇస్తున్నామని ప్రభు త్వానికి తెలిపారు. కొత్త జడ్జి పేరు ను మధ్యాహ్నం చెబుతామని ప్రభు త్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభు త్వం. సీఎం రేవంత్ రెడ్డి అంతర్గత సమావేశంలో కొత్త కమిషన్ చైర్మన్ ఎంపికకు ఇప్పటికే కసరత్తు ప్రారం భించారు. సుప్రీంకోర్టు నుండి అడ్వకేట్ జనరల్ ద్వారా సమాచారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy)ఉన్న పొలం గా కలెక్టర్ల సమావేశం తర్వాత కమిషన్ నూతన చైర్మన్ ఎంపికకు సంబంధించి ఉన్నతాధికారులు న్యాయ నిప్పులతో సంప్రదింపులు ప్రారంభించారు. దీంతో ఈ సాయం త్రానికి కొత్త చైర్మన్ నియా మకం ధ్రువీకరిస్తూ సుప్రీంకోర్టుకు ప్రభు త్వం నివేదిక సమర్పించడం ఉంది.
జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా..
తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్ పదవికి జస్జీస్ నరసింహరెడ్డి (Justice Narasimha Reddy) రాజీ నామా చేశారు. తక్షణం ఆ పదవి నుం చి వైతొలగాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. అదే సందర్భంలో కెసిఆర్ పిటిషన్ డిస్మిస్ కాగా వి ద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కెసిఆర్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ (dismiss)చేసింది. ఇంతటి తో ఈ విచారణ ను ముగిస్తునట్లు ధర్మాసనం వెల్ల డించింది.