— సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు (For ration card, for Arogyashri card)లింకు పెట్టొద్దని ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం కీలక (Revanth Reddy)ఆదేశాలు జారీ చేశారు. తెలంగా ణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాల న్నారు. మంగళవారం కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (Digital Health Profile) రూపొందించాలని తెలిపారు. రా ష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనిం గ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వా లన్న డిమాండ్ ఉందన్నారు. ఇందు కు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలిం చాలని సీఎం సూచించారు.
ఆర్ఎం పీ, పీఎంపీలు (RMP, PMP) ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ ఏరియా లో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలి పారు. గిరిజన ప్రాంతాల్లో (tribal areas) సరైన వై ద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పి టల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని తెలి పారు.