Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU: జిపి కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలి

–ప్రజా నాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి

CITU: ప్రజా దీవెన, నల్లగొండ : గ్రామపంచాయతీ కార్మికుల (Gram panchayat workers) అందరికీ పెండింగ్ (wages)వేతనాలు వెంటనే ఇవ్వాలని, మల్టీ పర్పస్ వర్కర్ A multi-purpose worker)కాదు అనే పేరుతో వేతనాలు ఇవ్వకుండా కార్మికులను భయ భ్రాంతులకు గురిచేస్తే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు (CITU) సంఘం నాయకులు ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి హెచ్చరించారు. నాంపల్లి మండలంలో 7 నుండి 18 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని అవి ఇవ్వాలని అనేక ఆందోళనలు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 150 కోట్ల 57 లక్షల 59 వేల 500, ఇచ్చిన బడ్జెట్ ను (budget) కార్మికులందరికీ వేతనాల ఇవ్వకుండా జీవో నెంబర్ 51 ప్రకారం 500 జనాభాకు ఒక వర్కర్ ఉండాలని మల్టీపర్పస్ వర్కర్స్ (Multipurpose workers)కాదు అనే పేరుతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.

కొంతమంది పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు (Panchayat Secretaries and Special Officers)500 జనాభాకు ఒక్కరూ మించి ఉన్న కార్మికులు వద్దని మిమ్మల్ని తీసేయమని పైనుంచి ఆదేశాలు వచ్చాయని కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఇలాంటి పనులు మానుకోకపోతే కార్మికుల సమీకరించి పోరాడుతామని అవసరమైతే సమ్మెకు పోతామని హెచ్చరించారు. చేసిన పనికి జీతాలు ఇవ్వకుండా పోరాడి సాధించుకున్న బడ్జెట్ కూడా ఏదో ఒక రకంగా కార్మికులకు దక్కకుండా చేయాలని అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. వచ్చిన బడ్జెట్ ను వేతనాల కోసం కార్మికుల ఖాతాలో వెంటనే జమ చేయాలని డిమాండ్ (demand)చేశారు. కార్మికులందరూ మల్టీ మల్టీపర్పస్ అయినా కాకపోయినా ఐక్యంగా ఉండి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ధైర్యంగా అధికారులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.