Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jaggareddy: ప్రోటోకాల్ పై దెయ్యాలు వేదాలు వల్లించినట్లే..!

–సంగారెడ్డిలో గెలిచిన నన్ను కాదని ఓడిన నేతతో శంకుస్థాపనలు చే యించలేదా
–సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న ప్పుడు మీ వ్యవహారం గుర్తుకులేదా
–ఇప్పుడు అడగడంలో అర్థం పర్థం ఉంటుందా ఆలోచించండి
–గాంధీభవన్‌లో మీడియా సమా వేశంలో మాట్లాడుతున్న జగ్గారెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy)ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గమైన మల్కా జిగిరిలో ప్రొటోకాల్‌ను పాటించని కేటీఆర్‌, హరీశ్‌రావులు ఇప్పుడు ప్రొటోకాల్‌ (protocol)గురించి అడగడంలో అర్థం లేదని టీపీసీసీ కార్యని ర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. సంగారెడ్డికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. అప్పటి మంత్రి హరీశ్‌ రావు.. తనను పక్కన పెట్టి ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థితో శంకుస్థా పనలు, కొబ్బరి కాయలు కొట్టించలేదా అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగైదు రోజలుగా ప్రొటోకాల్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలన ముందు వారి అనుభవం, వయసు చాలా చిన్నదని విమర్శించారు. సంగారెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌గా తాను ఉన్నప్పుడు..

అప్పటి సీఎం చంద్రబాబు (chandra babu)సంగారెడ్డిలో ఏవైనా కార్యక్రమాలకు వస్తే.. ప్రొటోకాల్‌ ప్రకారం తనను పిలిచేవారన్నారు. అలాగే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (Rajasekhar Reddy)నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ప్రతిపక్ష నాయకులకు ప్రొటోకాల్‌ ప్రకారం అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారన్నారని గుర్తు చేశారు. నాడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి (revanth reddy)మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు సచివాలయానికి వెళ్తుండగా రోడ్డుమీదే ఆపేశారని, దీనికి జవాబు చెప్పి ప్రొటోకాల్‌ (protocol)గురించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో అప్పటి మంత్రి హరీశ్‌ రావు.. తనను పక్కనపెట్టి ఓడిపోయిన బీఆర్‌స్‌ (brs)అభ్యర్థితో కొబ్బరికాయలు కొట్టించలేదా అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాళ్లతో సచివాలయంలోని తమ మంత్రుల చాంబర్లు కిటకిటలా డుతున్నాయని ఆయన అన్నారు.

ఇక మహేశ్వరం నియోజకవర్గం (Maheshwaram Constituency)లోని ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్‌ వివాదంపై జగ్గారెడ్డి (jaggareddy) స్పందిస్తూ ‘‘ఆ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డికి కుర్చీ వేసి గౌర వించిన తర్వాతనే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్‌కు కుర్చీ వేసి గౌరవించారు. ఇందులో తప్పే ముంది ప్రొటోకాల్‌ పాటించినం కదా అన్నారు. కేసీఆర్‌ ప్రొటోకాల్‌ను పాటించనప్పుడు మాట్లాడని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఇప్పుడు ప్రశ్నించడంలో అర్థం లేదన్నారు. ప్రస్తుత రాజకీయాలు అత్తారిల్లు తల్లిగారిల్లులా మారాయని జగ్గా రెడ్డి అన్నారు. నాయకులు పార్టీలు మారడం సాధారణంగా మారిపో యిందని, ఇది తీవ్రమైన విషయమే కాదని చెప్పారు. ప్రజలూ పెద్దగా పట్టించుకోవట్లేదని, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో దీనిపైన చర్చ కూడా వృధాయేనన్నారు.