–కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ అనుమ తి పై తప్పుడు ప్రాపగండ
— కాళేశ్వరం డిజైన్లు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివే
–తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనడం శుద్ధ అబద్ధo
–బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ నిర్ణయం సరికాదు
-జస్టిస్ ఘోష్ కమిటీకి కేంద్ర జలవ నరుల శాఖ సలహాదారుడు శ్రీరాం వెదిరె
Kaleshwaram project:న్యూఢిల్లీ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) కేంద్ర జలవనరుల సం ఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లభించాయంటూ కేసీఆర్ ప్రభు త్వం (KCR Govt) తప్పుడు ప్రచారం చేసిందని కేంద్ర జలవనరుల శాఖ సలహాదా రుడు శ్రీరాం వెదిరె స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ పేరు చెప్పి, ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మళ్లించారని తెలిపారు. చిల్లర కారణాలు చూపించి, ప్రాణహి త, చేవెళ్ల పథకాన్ని పక్కనపెట్టి, కాళే శ్వరం ప్రాజెక్టును తెరపైకి తీసుకొ చ్చారని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల ఆమోదానికి, కేంద్రా నికి సంబంధం లేదని స్పష్టం చేశా రు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై శ్రీరాం వెదిరె మంగళవారం జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్‌కు నివేదించారు. . వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2015లో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.12 వేల కోట్లతో చేపట్టిన పనులను కేసీఆర్ సర్కారు గాలికి వదిలేసి ప్రజాధనాన్ని వృథా చేసిం దని శ్రీరాం తెలిపారు. నాలుగు బూ టకపు కారణాలతో ప్రాజెక్టును (projects మళ్లిం చారన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల (tcm)మేరకు జలాలు లభించవని సీ డబ్ల్యూసీ చెప్పింద న్న పేరుతో మేడిగడ్డకు ప్రాజెక్టును మళ్లించడం దారుణమని, సీడబ్ల్యూ సీ (CWC) ఎప్పుడూ అలా చెప్పలేదన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల మేరకు జలాలు లభిస్తాయని, 75% మేరకు ఆధారపడవచ్చనే జలసం ఘం చెప్పిందని స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టుకైనా 75% జలాలు లభిస్తా యని సంతృప్తి చెందినప్పుడే అను మతులు లభిస్తాయన్నారు. మహా రాష్ట్రలో భూములు ముంపునకు గురవుతాయన్న కారణంతో ప్రాజె క్టును మేడిగడ్డకు మళ్లించామని చెప్ప డం హాస్యాస్పదమన్నారు. పొరుగు రాష్ట్రంతో చర్చించి సమ స్యను పరిష్కరించుకోవచ్చని తెలి పారు. కాళేశ్వరానికి తమ సొంత డిజైన్ సంస్థ ద్వారా సర్టిఫికెట్ ఇచ్చుకుని, సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని కేసీఆర్ సర్కారు తప్పు డు ప్రచారం చేసిందన్నారు. ఒక రాష్ట్ర డిజైన్ సంస్థ సర్వే, పరిశోధన, డిజైన్, మోడలింగ్ చేశామని తమ కు తాము సర్టిఫికెట్ ఇచ్చుకు న్నప్పుడు సీడబ్ల్యూసీ అందులో జోక్యం చేసుకోదని తెలిపారు.
నిర్మాణంలో పూర్తిగా విఫలం.. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్లానింగ్, డిజైన్, నాణ్యత, నిర్మాణం, నిర్వహణ విష యంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని శ్రీరాం చెప్పారు. సరైన పరిశోధనలు లేకుండానే ప్రాజెక్టును నిర్మించారన్నారు. అ న్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించా ల్సి ఉందని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. 2019లో ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే వైఫల్యాలు బయటపడ్డాయని, వాటిని సరిగా పరిష్కరించలేకపోవడంతో 2023 లో మేడిగడ్డ కుంగిపోయిందని వివ రించారు. డీపీఆర్ రూపొందించ డానికి ముందే బ్యారేజీ నిర్మా ణం ప్రారంభించారన్నారు. శాస్త్రీయ పరిశోధనలు లేకుండానే డిజైన్ (design), నిర్మాణం జరిగిందని చెప్పారు. బ్యారేజీలు కట్టి స్టోరేజీ రిజర్వా యర్లుగా వాడుకోవడం అతిపెద్ద తప్పిదమని, మేడిగడ్డ స్థల ఎంపి కలోనే లోపాలున్నాయని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే గ్రావిటీతో నీరందేదని, మేడిగడ్డలో కట్టడం వల్ల ఏటా ఎత్తి పోతలకే రూ.11 వేల కోట్లు అవు తుందని చెప్పారు. ఎన్‌డీఎస్‌ఏ మే 1న సమర్పించిన మధ్యంతర నివేbదికలో సూచించిన చర్యలపై రేవంత్ ప్రభుత్వం ఇంకా స్పందిం చాల్సి ఉందన్నారు. అథారిటీ సూచనలపై తీసుకునే చర్యల విషయంలో తీవ్ర జాప్యం జరు గుతోందని చెప్పారు.
ఆ 25 మంది ఇంజనీర్లే కారణం!?
● వారి వైఫల్యం వల్లే స్పష్టమైన లోపాలు
–పది రోజుల్లోగా కాళేశ్వరం రికార్డులు అందజేయాలి
–ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram project) బ్యారేజీల వైఫ ల్యానికి 25 మంది ఇంజనీర్లే కార ణమని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. వారు విధి నిర్వ హణలో నిర్లక్ష్యంగా వ్యవ హరిం చడమే ప్రాజెక్టులో లోపాలకు కార ణమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ (Vigilance and Enforcement) కూడా ప్రాథమిక నిర్ణ యానికి రావడంతో ఆ నివేదికను తెప్పించుకొని, ఇంజనీర్లను ప్రశ్నిం చడంతో పాటు విధి నిర్వహణలో వైఫల్యాలపై విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించినట్లు తెలిసింది. విజిలెన్స్ నివేదిక రాగానే ఆగస్టు రెండో వారంలో వీరిని విచారణకు పిలిపించడానికి సన్నాహాలు చే స్తోంది. ఇక కాళేశ్వరం పథకానికి సంబంధించిన పత్రాలన్నీ 10 రోజు ల్లోగా అందించాలని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రభుత్వానికి సూచిం చారు. ఆ పత్రాలన్నీ అందితేనే విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన భావిస్తున్నారు. ఇక ఆగస్టు 5లోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని తాజాగా విచా రణకు హాజరైన అధికారులకు కమిషన్ స్పష్టం చేసింది. విచారణ లో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్‌కు సహకరించడానికి వీలుగా తెలంగా ణ, బెంగాల్‌తో సంబంధం లేదని న్యాయవాదిని ఆగస్టు నుంచి కమి షన్‌కు అందుబాటులో ఉంచాలని జస్టిస్ ఘోష్ కోరారు.