— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: రైతు రుణమాఫీలో భాగంగా ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ (Farmer loan waiver)పొందిన రైతులతో రైతు వేదికలలో సంబరాలు నిర్వహిం చనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి (Narayana Reddy) తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని ఆయన వ్యవసాయ అధికారు లను ఆదేశించారు. ఈ విషయమై బుధవారం అయిన జిల్లా వ్యవసా య శాఖ జాయింట్ డైరెక్టర్, మండ ల వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ ప్రకటించిందని, ఇందు లో భాగంగా గురువారం లక్ష రూపా యల లోపు రుణాలున్న రైతుల రుణమాఫీ (Farmer loan waiver) చేయడం జరుగుతు న్నదని, ఇందుకు సంబంధించి రైతుల వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు (collector)పంపించడం జరిగిందని తెలి పారు.
ఈ మేరకు రుణమాఫీ (Farmer loan waiver) పొం దిన రైతులు (farmers) గురువారం మధ్యా హ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత రైతు వేదికల వద్దకు ర్యాలీలు , డప్పుల తో చేరుకుంటారని ,అనంతరం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) రుణమాఫీ పొందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడనున్నట్లు కలెక్టర్ తెలిపా రు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని రైతు వేదికల వద్ద అవసరమైన ఎల్ఈడి స్క్రీన్లు (LED screens), ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో సంబంధిత ఎమ్మెల్యేలు పాల్గొం టారని, నల్గొండ అసెంబ్లీకి సంబం ధించి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే సంబరాలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల కు రైతులు ర్యాలీగా ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కి చేరుకుంటార ని ,అనంతరం సాయంత్రము 4 గంట లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిమంది రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను న్నట్లు ఆయన తెలిపారు.జిల్లా లోని అన్ని రైతు వేదికల తో పాటు, ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో సైతం తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని ఆదేశించారు. ప్రతి మండలం నుం డి సుమారు 200 మంది రైతులు రైతు వేదికల వద్ద సంబరాలలో పాల్గొననున్నట్లు ఆయన తెలి పారు.జిల్లా వ్యవసా య శాఖ అధికారి శ్రవణ్, మండలా ల వ్యవసాయ అధికారులు ఈ టెలి కాన్ఫరెన్స్ (Teleconference) కు హాజరయ్యారు.