Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

IAS Pooja Khedkar: మోసాల పూజా ఖేద్కర్‌

–ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పూజ మోసాలు

IAS Pooja Khedkar: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: వివాదా స్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ (IAS Pooja Khedkar) మోసాలు (Frauds) ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమె శిక్షణ ను ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు తగిన చర్యలు తీసుకునేం దుకు ఆమెను లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ)కు రావాలని ఆదేశించింది. ఐఏఎ స్‌కు ఎంపికవడానికి దివ్యాంగుల రిజర్వేషన్‌ను ఆమె దుర్వినియోగం చేయడంపై దర్యాప్తు చేపట్టిన అధి కారులు ఆమె దివ్యాంగ సర్టిఫికెట్‌ పొందడానికి నకిలీ రేషన్‌కార్డును చూపించారని, అందులో పేర్కొన్న అడ్రస్‌ కూడా తప్పుడు అడ్రస్‌ అని తాజాగా గుర్తించారు. పుణెలోని యశ్వంత్‌రావ్‌ చవాన్‌ మెమోరియ ల్‌(వైసీఎం) ఆస్పత్రి నుంచి వైకల్య సర్టిఫికెట్‌ (Disability Certificate)పొందడానికి ఆమె పింప్రి చించ్వాడ్‌ ప్రాంతంలోని ప్లాట్‌ నంబరు–53, డెహు–అలాండి, తల్వాడే అనే అడ్రస్‌లో నివాసం ఉన్నట్టు దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే, ఆ అడ్రస్‌లో థర్మోవెరిట ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మూతపడిన కంపెనీ ఉందని అధికారులు తాజాగా గుర్తించారు.

పింప్రి చించ్వాడ్‌ మున్సిపాలిటీ (Pimpri Chinchwad Municipality) పన్నుల విభాగం సమాచారం మేరకు ఆ కంపెనీ పేరిట రూ.2.7 లక్షల బకాయిలు ఉన్నాయి. నకిలీ రేషన్‌కార్డు (Fake ration card)పొందడానికి కూడా పూజా అదే అడ్రస్‌ను ఉపయో గించుకున్నట్టు తేలింది. మరోవైపు ఒక ఆడి కారు కొనుగోలుకు కూడా అదే అడ్రస్‌ను ఇచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. తాను లోకోమోటర్‌ అనే వైకల్యంతో బాధపడుతున్నానంటూ ఆమె 2022 ఆగస్టు 24న వైఎంసీ ఆస్పత్రి నుంచి వైకల్య సర్టిఫికెట్‌ పొందారు. ఆమెకు మోకాలిలో 7% వైకల్యం ఉన్నట్టు ఆ సర్టిఫికెట్‌లో వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు 2020 వరకు మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు డైరెక్టర్‌గా పనిచేసిన పూజా తండ్రి దిలీప్‌ ఖేద్కర్‌ ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టారంటూ ఏసీబీ మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. పూజా ఖేద్కర్‌ ( Pooja Khedkar)కుటుంబం నివసిస్తున్న భవనం వద్ద అక్రమ నిర్మాణానికి సంబంధించి పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌(పీఎంసీ) నోటీసు జారీ చేయడంతో ఆ నిర్మా ణాన్ని తొలగించినట్టు ఒక అధికారి బుధవారం వెల్లడించారు. కాగా, భూ వివాదం, రైతును గన్‌తో బెదిరించినట్లు కేసు నమోదైనప్పటి నుంచి పూజ తల్లిదండ్రులు అదృ శ్యంలో ఉన్నారు.

నకిలీ సర్టిఫికెట్లతో మరో యువ ఐఏఎస్‌..

2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అసిఫ్‌ కె.యూసుఫ్‌(కేరళ) ఓబీసీ (obc)కేటగిరిలో రిజర్వేషన్‌ లబ్ధి పొందేందుకు ఆదాయ సర్టిఫికెట్‌ను ఫోర్జరీ చేసినట్టు తాజాగా వెలుగు లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర యంత్రాంగం విచారణ చేపట్టింది. క్రీమీలేయర్‌ స్థాయి కంటే తక్కువ ఆదాయం ఉందంటూ తప్పుడు సమాచారంతో ఆయన ఓబీసీ సర్టిఫికెట్‌ పొందినట్టు దర్యాప్తులో తేలింది. యూసుఫ్‌ 2015 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 215వ ర్యాంక్‌ సాధించారు. పూజా ఖేద్కర్‌, యూ సుఫ్‌ వ్యవహారాలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఇలాంటి వేలాది కేసులపై లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్లు (demand)వస్తు న్నాయి.