–నిన్న ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్, నేడు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ఫ్రపుల్ దేశాయ్ పై మచ్చ
–అంగవైకల్యం కోటా దుర్వినియో గం చేశారంటూ అరోపణలు
–సైకిల్ తొక్కుతున్న, స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతున్న ఫోటోలు వైరల్ తో అనుమానాలు
—
Praful Desai IAS:మహారాష్ట్రలో ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్(Pooja Khedkar) నకిలీ అంగ వైకల్యానికి సంబంధించిన పత్రాలతో ఐఏఎస్ హోదా పొందారంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవే ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణ లోని ఓ ఐఏఎస్ అధికారిని చిక్కు ల్లోకి నెట్టాయి. కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ఫ్రపుల్ దేశాయ్ (Praful Desai IAS) సైతం ఇదే తరహాలో నకిలీ అంగ వైకల్యం పత్రాలు పొందారనే విమర్శలు అయితే మొదలై నాయి.ఫ్రపుల్ దేశాయ్ (Praful Desai IAS) సైకిల్ తొక్కుతున్న ఫొటో, గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోతో పాటు హైదరాబా ద్‌లో స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతున్న ఫోటలు సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అంగవైకల్యముంటే ఆయన ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారంటూ నెటిజన్లు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. యూపీఎస్‌సీ పరీక్షల్లో అంగవైకల్యం కోటాను ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. 2019 యూపీఎస్‌సీ పరీక్షల్లో 532వ ర్యాంక్ ఫ్రపుల్ దేశాయ్ సాధించారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఫ్రపుల్ దేశాయ్ (Praful Desai IAS)స్పందించారు.
తన కాలికి అంగవైకల్యం ఉందన్నారు. ఆ క్రమంలో కొన్ని శారీరక పనులు తాను స్వయంగా చేసుకోలేనని వివరించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు… ఐఏఎస్ (ias)శిక్షణలో భాగంగా తీసుకున్నవని తెలిపారు. తన అంగవైకల్యానికి సంబంధించి బెళగావి ఆసుపత్రి గతంలో జారీ చేసిన సర్టిఫికేట్ (Certificate)సైతం తన ఉందని అలాగే ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తనకు 45 శా తం అంగవైకల్యం ఉందని సరిఫికేట్ జారీ కూడా చేసిందని పేర్కొన్నారు. ఈ వైకల్యం కారణంతో తాను అస్స లు నడవలేనని కాదు కానీ స్నేహి తులతో కొంచెం ఆడుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తరచు కాకుండా ఎప్పుడన్నా తన స్నేహి తులతో బ్యాట్మంటన్ ఆడతాన న్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోలపై ఆయన సోదాహరణగా వివరిం చారు. నడిచినప్పుడైనా తన స్నేహి తులతో కలిసి నడిచినట్లు చెప్పా రు. అలాగే శిక్షణలో భాగంగా పర్వా తారోహణ చేశానన్నారు. గుర్రపు స్వారీ మాత్రం శిక్షకుడు పర్యవేక్ష ణలోనే చేశానని గుర్తు చేసుకు న్నారు. అయితే సోషల్ మీడియా లోని తనపై నెటిజన్లు చేస్తున్న కామెంట్ల పట్ల ఫ్రపుల్ దేశాయ్ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత జీవితంతో ఫ్రపుల్ దేశాయ్ ఇబ్బందులు..
కర్ణాటకలోని బెళగావి జిల్లా ఫ్రపుల్ దేశాయ్ (Praful Desai IAS)స్వస్థలం. రైతు కుటుంబా నికి చెందిన అతడు అయిదేళ్ల వ యస్సులో ఎడమ కాలికి పోలియో సోకింది. అయితే తన ఎడమ కాలు పూర్తిగా పక్షవాతానికి గురి కాలేదని చెప్పారు. కానీ దాదాపు కొంత వైకల్యం మాత్రం ఉందన్నారు. ఇక కర్ణాటకలోని నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ( Assistant Engineer)కొన్నాళ్లు వి ధులు నిర్వహించానని అలా యూ పీఎస్‌సీ పరీక్షలు రాసి ఐఏఎస్ సాధించినట్లు ఫ్రపుల్ దేశాయ్ వివరించారు.