Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu: కృత్రిమ మేధ వినియోగంపై ఇరువై ఏళ్ళ రోడ్ మ్యాప్

–ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu:ప్రజా దీవెన, హైదరాబాద్: కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీల్లో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (British High Commission in Artificial Intelligence and Cyber ​​Security, Ernst and Young)సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు అవడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు (Minister Sridhar Babu)హర్షం వ్యక్తం చేసారు. గురు వారం బ్రిటిష్ హై కమిషన్, ఇ&వై ప్రతినిధులతో ఆయన సచివాల యంలో బేటీ అయ్యారు. గ్లోబల్ సామర్థ్య కేం ద్రాలను ఏర్పాటు చేయ డంలో సహకరించాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరా రు.

వచ్చే 20 ఏళ్లకు సంబందించి ప్రభుత్వ పాలన, పారిశ్రామిక రంగా ల్లో (In government administration and industrial sectors) కృత్రిమ మేధ వినియోగంపై ఒక రోడ్ మ్యాప్ ను రూపొందించాలని ఆయన సూచించారు. తెలంగాణా ప్రభుత్వం 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీలో బ్రిటిష్ హై కమిషన్, ఎర్నెస్ట్ సంస్థలు కీలక భాగస్వాములు కావాలని శ్రీధర్ బాబు అభిలషించారు. సైబర్ సెక్యూరిటీలో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి హై కమిషన్ ముందుకు రావడం అభి నందనీయమని మంత్రి కొనియా డారు. సమావేశంలో బ్రిటిష్ హై కమిషన్ (British High Commission)కు చెందిన లారా బాల్డ్ విన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతిని ధులు వికాస్ అగర్వాల్, నవీన్ కౌల్, కిరణ్ వింజమూరి, రాష్ట్ర ఐటీ విభాగం జాయింట్ డైరెక్టర్ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.