Dandempalli Sattaiah:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అర్బన్ కాలనీలో మురి కి కాలువలు లేకపోవడం వలన మురికి గుంటలు ఏర్పడి దోమలు పెరిగాయని వెంటనే మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య (Dandempalli Sattaiah) కోరారు. గురువారం 11వ వార్డు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో మున్సి పల్ వార్డు కార్యాలయం లో జరు గుతున్న ప్రజావాణి ప్రత్యేక అధికారి జ్యోతి కి వినతి పత్రం సమర్పిం చడం జరిగింది.
ఈ సందర్భంగా సత్తయ్య (Dandempalli Sattaiah) మాట్లాడు తూ అర్బన్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం (Construction of CC roads) చేసి డ్రైనేజీ నిర్మించ కుండా వదిలేయడం ద్వారా ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు రోడ్లమీద పారడం గుంతలు ఏర్పడి దోమలు పెరిగి తీవ్ర అనారోగ్యనికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సిసి రోడ్లు నిర్మాణం చేసిన ప్రాంతాలలో మురి కి కాలువలు నిర్మాణం చేపట్టాలని కోరారు. పిచ్చి మొక్కలు (Crazy plants)పెరిగాయ ని వాటిని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెం పల్లి సరోజ ,శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, సభ్యులు దండెంపల్లి మారయ్య, పల్లె నగేష్, కాలనీవాసులు కోరే అంజయ్య, సంతోష్ కుమార్, పద్మ ,వెంకట్ రెడ్డి, సామెల్, బిక్ష్మయ్య,ఇడిగోటి జగన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు