National Theater Festival:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లోని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ (Telangana Election Commission) కార్యాలయంలో గురువారం కమిషనర్ సి.పార్థ సారథి అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ (National Theater Festival)-2024పోస్టర్ ని విడుదల చేశారు. తెలంగాణ సాంస్కృతిక భాషా సాంస్కృతిక శాఖ,అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ (National Theater Festival)- 2024 లో తెలుగు, కన్నడ,నాగ, మణిపురి,మరాఠీ నాటక ప్రదర్శనలు ఉంటాయని, మొత్తం ఆరు నాటకాలతో పాటు ప్రతిరోజూ ప్రారంభ కార్యక్రమంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయని, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 18వ జాతీయ బహుభాషా నాటకోత్సవమని, ఆగస్టు1వ తేదీ నుండి 3వ తేదీ వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రతిరోజూ సాయంత్రం 5.30నిమిషాలకు ప్రారంభమవుతాయని,ఇది అభినయ 70వ నాటకోత్సవమని అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రధాన సలహాదారులు సి.పార్థసారథి (C. Parthasarathy) తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాస్, ట్రస్టీ క్రోసూరి సుబ్బారావు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.