Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET Paper Leakage: పరీక్షా ‘కేంద్రం ‘ నీట్ ఫలితాలు

–నగరాల వారీగానూ రేపు మధ్యా హ్నం 12లోపు ప్రకటించాలి
–ఎన్‌టీఏను ఆదేశించిన సుప్రీంకో ర్టు, 22న మరోమారు విచారణ
–ఎన్‌టీఏ వ్యాజ్యాన్ని కలుపుకొని మొత్తం 40 పిటిషన్లను కలిపి విచారిoచిన ధర్మాసనం

NEET Paper Leakage:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీపై (NEET Paper Leakage) దాఖలైన పిటిషన్ల మీద విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం జాతీయ పరీక్షల నిర్వ హణ సంస్థ(ఎన్‌టీఏ)కు కీలక ఆదే శాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా ఫలితాలను ప్రక టించాలని స్పష్టం చేసింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబా టులో పెట్టాలని సూచించింది.

విద్యార్థుల గుర్తింపును బహిర్గతం చేయొద్దని పేర్కొంది. నీట్‌–యూజీ పరీక్షలు (NEET-UG Exams)మే 5న దేశవ్యాప్తంగా జరగ్గా పట్నా, హజారీబాగ్‌లలో పేపర్‌ లీకేజీ కేసులు నమోద య్యా యి. గుజరాత్‌లోని గోద్రా, మరికొ న్ని ప్రాంతాల్లో అవకతవకలు జరిగి నట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మే 5న జరిగిన నీట్‌ పరీక్షను రద్దు చేయా లని, తిరిగి పరీక్షను నిర్వహించా లని కోరుతూ పలువురు విద్యా ర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. ఎన్‌టీఏ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కలుపుకొని.. మొత్తం 40 పిటిషన్లను కలిపి విచారిస్తామ ని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ నెల 11న జరిగిన విచారణలో సీబీఐ, ఎన్టీఏ (CBI, NTA) వాదనలను నమోదు చేసుకుంది. గురువారం మరోమారు విచారణ చేపట్టింది. శనివారం ఫలితాలను నగరాలు, పరీక్ష కేంద్రా ల వారీగా విడుదల చేయాలని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ సంద ర్భంగా ఎన్టీఏను ఆదేశించారు. ఈ నెల 22న మరోమారు విచారణ చేపడతామని సూచించారు. పేపర్‌ లీకేజీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరగలేదని అభిప్రాయ పడ్డ ధర్మా సనం కేవలం పట్నా, హజారీబాగ్‌కే పరిమితమైనట్లు వెల్లడించింది. గుజరాత్‌, ఇతర ప్రాంతాల్లో పేపర్‌ లీక్‌ (paper leak) అవ్వలేదని చెప్పలేమని పే ర్కొంది. గోద్రాలో కేవలం అభ్యర్థుల తరఫున ఇత రులు ఓఎంఆర్‌ షీట్లను నింపినట్లు తేలిందని వివ రించింది. పిటిషనర్ల ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘పేపర్‌ లీకేజీ అనేది దేశవ్యాప్తంగా జరగలేదు. అలా జరిగిందనడానికి వేర్వేరు నగరాల్లో కాంటాక్ట్‌లను గుర్తించలేదు. లక్షల మంది విద్యార్థులు ఈ కేసు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్ష పవిత్రత విస్తృత స్థాయిలో దెబ్బ తిన్నదని గుర్తిస్తేనే మరోమారు పరీక్ష నిర్వహణకు ఆదేశాలు జారీ చేయ గలం. దీనిపై సీబీఐ దర్యాప్తు జరు గుతోంది. సీబీఐ ఇప్పటి వరకు మాకు చెప్పిన దర్యాప్తు వివరాలను మేం బహి ర్గతం చేశాం’’ అని వ్యా ఖ్యానించింది. ప్రశ్నపత్రం లీకేజీ కొన్ని కేంద్రా లకే పరిమితమైందా లేదా దేశ వ్యాప్తంగా వ్యాపించిందా అనే విషయాలు తెలియాలంటే పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాల విడుద ల కీలకమని అభిప్రాయ పడింది.

సీబీఐ అదుపులో ఎయిమ్స్‌ విద్యార్థులు

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసును దర్యా ప్తు చేస్తున్న సీబీఐ (cbi)గురువారం పట్నాలోని ఎయిమ్స్‌లో చదువు తున్న నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న చందన్‌సింగ్‌, రాహుల్‌ అనంత్‌, కుమార్‌ షాను, రెండో సంవత్సరం విద్యార్థి కరణ్‌ జైన్‌ ఉన్నా రు. ‘‘సీబీఐ అధికారులు హాస్టల్‌ గదుల్లోనే విద్యార్థులను విచారించారు. ఆ తర్వాత ఆ గదులకు సీల్‌ వేసి, విద్యార్థులను తమ వెంట తీసుకెళ్లారు’’ అని పట్నా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ జీకే పాల్‌ తెలిపారు. అయి తే.. ఈ కేసులో సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన పంకజ్‌ కుమార్‌ అలియాస్‌ ఆదిత్య (Alias ​​Aditya ) అనే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌తో ఈ నలుగురు విద్యార్థులకు సంబం ధాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.