Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme Court: చట్టాల పేరుతో బెయిల్ అడ్డుకుంటారా

–బెయిలివ్వకుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు స్పష్టం

Supreme Court:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నేర శిక్షాస్మృతిలోని (Criminal Penal Code)కఠిన చట్ట నిబం ధనలు నిందితులకు బెయిలివ్వ కుండా రాజ్యాంగబద్ధ కోర్టులను ఆపలేవని సుప్రీంకోర్టు (Supreme Court)స్పష్టం చే సింది. 21వ రాజ్యాంగ నిబంధన ప్రసాదించిన జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ విస్తృృతమై నవీ, పవిత్ర మైనవని తేల్చి చెప్పింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) కింద అరెస్టయిన నేపా లీ పౌరుడు షేక్‌ జావేద్‌ ఇక్బాల్‌కు బెయిలు మంజూరు చేస్తూ విడు దల చేయాలని ఆదేశించింది. జస్టి స్‌ జేబీ పార్థీవా లా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పుని చ్చింది.

ఎంత కఠినమైన శిక్షాస్మృతి (Criminal Penal Code) చట్ట నిబంధన అయినా దాని అర్థాన్ని తీసుకొనే సమయం లో రాజ్యాంగ న్యాయస్థానం హైకో ర్టు, సుప్రీంకోర్టు రాజ్యాంగ విలువల కు, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండా లని చెప్పింది. ఆ రెండిం టిలోనూ వ్యక్తి స్వేచ్ఛ అంతర్లీనంగా ఉంటుం దని వివరించింది. ఈ నేపా లీ వ్యక్తి కేసులో రాజ్యాంగ న్యాయ స్థానం బెయిలు ఇవ్వొచ్చు, ఇవ్వక పోవచ్చు కానీ ఫలానా చట్టం కింద బెయిలు ఇవ్వడం కుదరదని చెప్ప డం తప్పే అవుతుందని స్పష్టం చేసింది. ఇక్బాల్‌ నేపాల్లో (Iqbal in Nepal) భారతదే శపు నకిలీ నోట్లను చెలామణి చేస్తు న్నట్లు అంగీకరించాడని పోలీసులు ప్రకటించారు. అతని మీద 489 (బి), 489(సి) కింద నకిలీ నోట్లు ఉంచుకున్నాడని, నకిలీ నోట్లు చెలా మణి చేస్తున్నాడని కేసు పెట్టారు. దానికి తీవ్రవాదులపై ప్ర యోగించే ఉపా చట్టాన్ని జోడించారు. ఇక్బాల్‌ తొమ్మిదేళ్లుగా కస్టడీలో ఉన్నాడని, ఈకేసు ఇప్పట్లో తేలే వాతావరణం కనబడటం లేదని నిందితుడి తర ఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసు కువచ్చారు.

ఇక్బాల్‌ (Iqbal) తీవ్రమైన నేరా నికి పాల్పడ్డా డని, నేపాలీ పౌరుడు అయినం దున దేశం విడిచి పారి పోయే ప్రమాదం ఉందని ఉత్తరప్ర దేశ్‌ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. నత్తనడకన నడుస్తున్న ఈ కేసు ఎప్పట్లోగా తేలుతుందో స్పష్టత లేదని కోర్టు అభిప్రాయపడింది. పాస్‌పోర్టు, పౌరసత్వ పత్రాలను తీసుకొని అతన్ని విడుదల చేయా లని ఆదేశించింది. ఇప్పటికే స్వాధీ నం చేసుకుంటే ట్రయల్‌ కోర్టుకు అప్పగించాలని పేర్కొంది. ట్రయల్‌ కోర్టు (Trial Court) విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని నిందితుడికి చెప్పింది. విచారణ పూర్తయ్యే దాకా పక్షం రోజులకు ఒకసారి పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలని ట్రయల్‌ కోర్టు నిబంధన పెట్టొచ్చని సూచించింది.