Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Neela Satyanarayana:కిడ్స్ కళాశాలలో డిప్లమో విద్యార్థినిలకు అవగాహన

*గ్రామీణ పేద విద్యార్థినులకు ఉన్నత విద్య అందించటమె లక్ష్యం
*సాంకేతిక విద్యతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు
*విద్యార్థినిలు కళాశాల యాజమాన్యం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొవాలి , మీలా సత్యనారాయణ

Neela Satyanarayana:ప్రజా దీవెన, కోదాడ: ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడుకున్న సాంకేతికను విద్యను అందించే ఉమ్మడి జిల్లాలోని ఏకైక ఇంజనీరింగ్ మహిళా కళాశాలCollege of Engineering for Women) కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అని చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డిప్లమా కోర్సుతో (Diploma Course)త్వరగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చు అన్నారు కళాశాల నుండి డిప్లమా పూర్తి చేసిన అనేకమంది విద్యార్థులు నేడు ఉన్నతఉద్యోగాల్లోఉన్నారన్నారు.

విద్యార్థినిలు కళాశాల యాజమాన్యం కల్పించేసదుపాయాలుసద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాంధీ, అకడమిక్ అడ్వైజర్ పోతుగంటి నాగేశ్వరరావు (Academic Advisor Potuganti Nageswara Rao)లు మాట్లాడుతూ మహిళా సాధికారత కు ప్రతీకగా కిట్స్ కళాశాల (Kitts College)నిలుస్తుందన్నారు.విద్యార్థులు ఇష్ట పడి చడవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణా రావు,హెచ్ ఓడీ లు రమేష్ నరేశ్ రెడ్డి స్రవంతి,జనార్దన్,అధ్యపకు లు పాల్గొన్నారు.