–నిరాధార మహిళలకు సఖి, స్వధా ర్ కేంద్రాలు అండగా నిలబడాలి
–మహిళలు ఆర్థికంగా వారికాళ్లపై వారు నిలబడినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు,గౌరవం
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: శిశు గృహ, సఖి, స్వధార్ గృహాల (Shishu Griha, Sakhi, Swadhar Griha) పై ఎలాంటి ఆధారం లేని వారికి అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించా లని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) అన్నారు. శనివారం అయన నల్గొం డ జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్, శిశు గృహ, సఖి, స్వధార్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా జిల్లా కలెక్టర్ బాలసదనం సందర్శించి అక్కడ ఉన్న చిన్నారుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. చం డూరు మండలం పురంపల్లికి చెంది న నాలుగో తరగతి చదివే పూజిత ను తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్పించగా చదువు కోసం శిశు గృహకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలుపగా, తక్షణమే కలెక్టర్ స్పందించి మంచి పాఠశాలలో చేర్పి స్తామని, మంచి చదువు చెప్పిస్తా మని, భోజనం, బట్టలు ఇప్పి స్తామని భరోసా ఇచ్చారు.
పక్కనే ఉన్న శిశు గృహ (Children’s home)ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంత మంది చిన్నారులు శిశు గృహాలు ఉన్నారని ప్రతిరోజు డాక్టర్ పరీక్షి స్తున్నారా వారికి పాలు ,ఇతర సంరక్షణ ఎలా చేస్తున్నారని నిర్వా హకులను అడిగి తెలుసు కున్నా రు. జూలై నెలలో ఎంతమం ది పిల్లలు వచ్చారని, ఎంతమందిని ఇప్పటివరకు దత్తత ఇచ్చారని పూర్తి వివరాలను ఆయన అడిగారు.తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పెళ్లికాకముందే పుట్టిన చిన్నారులను బయట వదిలివేయకుండా శిశు గృహాకు తీసుకువచ్చి అప్పగించే విధంగా శిశుగృహపై విస్తృతంగా అవగా హన కల్పించాలని ,శిశు గృహ పై మంచి నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిశు గృహాకు వచ్చిన పిల్లలను అవసరమైన వారికి దత్తత ఇవ్వడం ద్వారా శిశు గృహ పై నమ్మకం కలుగుతుందని చెప్పారు. పిల్లల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అన్నా రు.
బాలసదన్, శిశు గృహ నిర్వ హణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ (collector) ప్రకాశం బజార్ లో ఉన్న సఖి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జూలై నెలలో నమోదైన కేసుల వివరాలను అడగగా ,28 కేసులు ఇప్పటివరకు నమోద య్యాయని నిర్వాహకులు తెలిపా రు .భార్యా భర్తల తగాదా లు ,ఫోక్సో కేసుల వంటివి ఇక్కడకి వస్తున్నాయని తెలుసుకొని సఖి కేంద్రం పనితీరుపై ఆయన స్వ యంగా 181 కాల్ సెంటర్ కు సాధారణ వ్యక్తిలా ఫోన్ చేసి మాట్లాడారు. తనకు సమస్య ఉందని తన సమస్యను నమోదు చేయించేందుకు నల్గొండ జిల్లా సఖి కేంద్రం నంబర్ కు కాల్ కలపాలని సఖి కేంద్రం హెల్ప్ లైన్ నెంబర్ నిర్వాహకులతో కోరగా, వారు జిల్లా కలెక్టర్ కు నల్గొండ జిల్లా సఖి కేంద్రం ఫోన్ నెంబర్ 8682234088 కు ఫోన్ చేసి కనెక్ట్ చేశారు. ఈ విష యంపై ఆయన స్వయంగా మాట్లా డి నిర్ధారించుకున్న అనంతరం సఖి కేంద్రం (Sakhi Center)నల్గొండ నిర్వాహకులతో మాట్లాడుతూ సఖి కేంద్రంలో నమోదైన కేసుల వివరా లను పరిశీ లించారు.
అంతేకాక కేసు నమోదు చేసిన కొందరితో ఫోన్లో మాట్లాడి వివరా లను అడిగి తెలుసుకు న్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న సఖి కేంద్రం ఉందనే భరోసాను (barosa) కలిగించాలని, ఎలాంటి వారు వచ్చిన మేమున్నామనే నమ్మకం కలిగించాలని తెలిపారు. ఇద్దరు హోంగార్డులు కావాలని సఖి కేంద్రం (Sakhi Center) నిర్వాహకులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయగా తక్షణమే ఏర్పా టు చేస్తామని కలెక్టర్ చెప్పా రు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వధార్ గృహ కేంద్రాన్ని తనిఖీ (checking)చేశారు. అక్కడున్న మహిళలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని ఏం చేస్తున్నారని అడిగారు.ఆయా వృత్తులలో శిక్షణ (training)ఇచ్చిన తర్వాత ఏదైనా పని చూపిస్తే చేసుకోవాని సూచిం చారు.ఈ కేంద్రం లో డిగ్రీ, ఇంటర్, ఏఎన్ఎం తదితర కోర్సులు చేస్తు మధ్యలో వదిలేసిన వారు ఉండగా, వారి చదువులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకో వాలని,వారు చదువుకునేం దుకు ఫీజులు చెల్లించాలని, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన 3 మహిళలకు ఏ ఎన్ ఎం లు గా ఎక్కడైనా అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా పని చేసుకునే వారికి పని కల్పిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలి పారు. మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళపై వారు నిలబడాలని, అప్పు డే సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తాయని అన్నారు. ఈ సందర్భం గా కొందరు టైలరింగ్ బ్యూటిషన్ చేస్తున్నామని తెలుపగా పాఠశాల విద్యార్థుల యూనిఫార్మ్స్ ను కుట్టే బాధ్యతను అప్పగిస్తామని,అలాంటి పనులు చేసుకోవాలని ఆయన సూచిం చారు.జిల్లా కలెక్టర్ వెంట ఆయా కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.