Jagan:ప్రజా దీవెన, అమరావతి: వైసీపీ అధినేత జగన్ (jagan) ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో (Abdul Nazir) భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవ న్కు చేరుకోనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరా చక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ కు వివరించనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ ముఖ్య మంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy)భేటీ కానున్నారు.
వైయస్ఆర్ (ysr)కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి YS Jagan Mohan Reddy ఆదివారం సాయంత్రం 5 గం.కు రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి (tdp)అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడు లు, విధ్వంసాలను వైయస్ జగన్, రాష్ట్ర గవర్నర్ కు వివరించనున్నా రు. వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహ నం చేయడం సహా, ఈ 45 రోజు లుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను (Evidence, videos)వైయస్ జగన్ , గవర్నర్ అబ్దుల్ నజీర్ కుఅందజేస్తారు.