Bajaj- Flipkart :ప్రస్తుత రోజులలో ఈ-కామర్స్ సైట్స్‌లో కొనుకోలు బాగా చేస్తున్నారు.ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఈ-కామర్స్ సైట్స్ ద్వారాను ఎక్కువగా కొంటున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ (Amazon, Flipkart) ప్రత్యేక ఆఫర్లతో సేల్స్ డేస్‌ను మొదలు పెట్టడం వినియోగదారులు కూడా ఆన్లైన్ షాపింగ్ చేయడం ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో అమ్మకాలు తారా స్థాయికు చేరడం కూడా విశేషమే. ఇది ఇలా ఉండగా తాజాగా ప్రముఖ కంపెనీ అయిన బజాజ్ ఆటో భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో (Flipkart)కలిసి పనిచేసినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో బజాజ్ మోటార్‌సైకిళ్ల మొత్తం శ్రేణి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్లైన్లో (online) కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది. ఈ సదుపాయం ప్రారంభ దశలో భారతదేశంలోని 25 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండబోతుందట, అయితే కంపెనీ క్రమంగా దాని పరిధిని కూడా విస్తరించాలని భావిస్తోంది.
ఈ క్రమంలో బజాజ్ బైక్ ఆన్లైన్ డెలివరీ(Online delivery) గురించి మరిన్ని వివరాలను ఇలా ..ఫ్లిప్‌కార్ట్ కూడా ఇకపై వినియోగదారులు ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ ధరకే బజాజ్ బైక్స్‌ను అందిస్తామని కూడా తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్ విక్రయాలను పెంచేందుకు బజాజ్ ప్రత్యేక ఆఫర్లను కూడా విడుదల చేసింది. రూ.5,000 తక్షణ తగ్గింపుతో పాటు 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంకు కార్డుల ఆఫర్లను కూడా వినియోగదారులకు అందిస్తుంది.
బజాజ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో (Portfolio)భారతదేశంలో వివిధ రకాల ద్విచక్ర వాహనాలు ఉండడం మనకి తెలిసిందే. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీతో నడిచే మోటార్‌సైకిల్ ఫ్రీడమ్‌ను ఇటీవల బజాజ్ సంస్థ విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ లైనప్‌లోని ఇతర బైక్‌లలో ప్లాటినా 100 నుంచి డొమినార్ 400, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ వంటి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు (Performance Motorcycles) వంటి సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయట. అలాగే ఫ్లిప్ కార్ట్‌లో బజాజ్ కంపెనీకు (Bajaj Company on Flipkart)చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించనుంది. ప్రస్తుతం ఈ-చేతక్ ధరలు రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలు అవుతున్నాయి. చూడాలి మరి బజాజ్ సంస్థ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ లో ఎలా ఉంటాయో…