–తాజాగా బాలుడి మృతి, కోళికోడ్ లో పలువురి ఐసోలేషన్
–ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం, పుణె నుంచి మొబైల్ ల్యాబ్
–గుజరాత్‌ను వణికిస్తున్న చాందీపు ర వైరస్, 50 కేసులు నమోదు, 16 మంది మృతి
Nipah virus in Kerala::ప్రజా దీవెన, కేరళ: నిఫా వైరస్ కేరళను (Nipah virus in Kerala) వణికిస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లా పందిక్కడ్‌లో ప్రమాదకర నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు కోజికోడ్‌లో (Kozhikode) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెం దడoతో కేరళలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈమేరకు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ బాలుని మృతి కి సంబందించి ప్రకటన చేశారు. ఆ బాలుడికి ఆది వారం ఉదయం 10.50 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, చికి త్స చేసి రక్షించేందుకు చేసిన ప్రయ త్నాలు విఫలమయ్యాయన్నారు. అంతర్జాతీయ నిబంధనలప్రకారం అతడికి అంత్యక్రియలు జరుగు తాయన్నారు. ఆ బాలుడు చికిత్స పొందిన కోజికోడ్ వైద్య కళాశాలలో ముగ్గురు వ్యక్తులను ఐసొలేషన్‌లో ఉంచినట్లు మంత్రి చెప్పారు. అలాగే మంజేరి వైద్య కళాశాలలో నలుగు రు హై రిస్క్ కేటగిరీలో ఉన్న వ్యక్తు లు చేరారని, వారిలో ఒకరు ఐసీ యూలో ఉన్నారని తెలిపారు. మృ తి చెందిన బాలుడికి దగ్గరగా మస లిన 246 మందిలో 63 మందిని హై రిస్క్ కేటగిరీగా గుర్తించామన్నారు. వారందరికీ వైద్య పరీక్షలు చేయను న్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వారికి వైద్య పరీక్షలు చేసేందుకు తగిన ల్యాబ్‌లు ఉన్నాయని, అలా గే పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టి ట్యూట్ నుంచి ఒక మొబైల్ ల్యాబ్ రానున్నట్లు మంత్రి చెప్పారు.
నిఫా వైరస్ (Nipah virus)బయటపడిన పందిక్కడ్‌తో పాటు రెండు పంచాయతీల్లోని 33,000 ఇళ్లలో జ్వరాలపై పరిశీల న చేయనున్నట్లు చెప్పారు. పంది క్కడ్‌కు మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి తెప్పించి పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో (Institute of Virology) భద్రపర చిన మోనోక్లోనల్ యాంటీబాడీలు కూడా రాష్ట్రానికి చేరినట్లు మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. కాగా కేర ళ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేం దుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంప నున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. నిఫా వైరస్ ప్రబలిన ప్రాంతంలో అందుకు కారణాలను గుర్తించేందుకు ఈ బృందం సహకరిస్తుంది. కోజికోడ్‌లో చనిపోయిన బాలుడి నమూనా లను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా నిఫా వైరస్‌గా నిర్ధారించి నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిం చింది. చనిపోయిన బాలుడికి దగ్గరగా మసలిన వారిని గుర్తించి కచ్చితంగా క్వారంటైన్ చేయా ల్సిందిగా కేరళ ప్రభుత్వానికి సూ చించినట్లు తెలిపింది. గబ్బిలాల్లో (ఫ్రూట్ బ్యాట్) నిఫా వైరస్ ఉంటుం దని, అవి తగిలిన చెట్ల పండ్లను తిన్నవారికి ఈ వైరస్ సోకుతోంది. కేరళలో కోజికోడ్ జిల్లాలో 2018, 2021, 2023లో, ఎర్నాకుళం జిల్లా లో 2019లో నిఫా వైరస్ ప్రబలింది. కోజికోడ్, వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకుళం జిల్లాల్లోని గబ్బిలాల్లో నిఫా వైరస్ యాంటీ బాడీలను (Nifa virus antibodies)గుర్తించారు.
గుజరాత్‌ను వణికిస్తున్న చాం దీపుర వైరస్… చాందీపుర వైరస్ (Chandipura virus)గుజరాత్‌ను వణికిస్తోంది. రాష్ట్రం లో 50 చాందీపుర వైరస్ కేసులు, ఈ వైరస్ అనుమానిత లక్షల ణాల తో 16 మంది మృతిచెందారని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రుషికేశ్ పటేల్ (Rushikesh Patel) వెల్లడించారు. సబర్ కాంత జిల్లాలోని హిమ్మత్‌పూర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటి వరకు ఇక్కడ 14 చాందీపు ర వైరస్ కేసులు నమోదవగా వారి లో ఏడుగురిని ఆస్పత్రికి తరలిం చాల్సి వచ్చిందని చెప్పారు. గుజ రాత్ వెలుపల కూడా ఈ వైరస్ కేసులు మూడు కనిపించాయని, దీంతో ఈ వైరస్ కేసులు ఇతర రాష్ట్రాలకూ వ్యాపించిందని పటేల్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యం లో ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశా మని చెప్పారు. ముఖ్యమంత్రి భూ పేంద్ర పటేల్ కూడా చాందీపుర వైర స్ పరిస్థితిని సమీక్షించారు. జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేయాలని ఆదేశించారు. తొలి సారిగా 1966లో మహారాష్ట్రలోని చాందీపురలో గుర్తించారు. ఇది 15 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా వ్యా పిస్తుంది. దీని వల్ల మెదడువాపు సంభవిస్తుంటుంది. ఈ వైరస్ దోమ ల ద్వారా వ్యాప్తి చెందుతుంది.