Mahatma Gandhi University:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University)జూన్ 15న నిర్వహించిన పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉప కులపతి ఆచార్య నవీన్ మెటల్ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా జి ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి (akula ravi)లతో విడుదల చేశారు. ఫలితాల వివరాలను ఎం జి యు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు , ప్రవేశాల ఇంటర్వ్యూల షెడ్యూల్ను వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి (akula ravi)తెలిపారు.
అనంతరం ఎం జి యు పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఫలితాలను (degree results)సైతం విడుదల చేశారు. మొత్తం 8118 మంది విద్యార్థులకు కాను 3,493 మంది , 43% మంది ఉత్తీర్ణత సాధించినట్లు డిగ్రీ పూర్తి చేసినట్లు కంట్రోలర్ తెలిపారు. మొదటి సెమిస్టర్ లో 37.47 రెండవ సెమిస్టర్ లో 35.65% మూడవ సెమిస్టర్ లో 40.6 9% నాల్గవ సెమిస్టర్ లో 41.61 శాతం అయిదవ సెమిస్టర్ లో 44.8% ఆరవ సెమిస్టర్ లో 45.68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ జి ఉపేందర్ రెడ్డి తెలిపారు.