Palabhishekam:ప్రజా దీవెన, కోదాడ: రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt)రుణమాఫీ చేయడం పట్ల గుడిబండ కాంగ్రెస్ పార్టీ, గ్రామ రైతులు (farmers) హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సోమవారం మండల పరిధిలోని గుడిబండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీ లకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి పాల్గొని ఫ్లెక్సీలకు పాలాభిషేకాన్ని చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని మరియు బడుగు బలహీన వర్గాల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు.
అదేవిధంగా మన కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఉత్తంకుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి లాంటి నాయకులు ఉండటం మన కోదాడ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ (Congress party) వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ల సీతారాం రెడ్డి గారు అమర నాయని వెంకటేశ్వరరావు గారు కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నర్సింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ (Congress party) గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు ఓరుగంటి రామకృష్ణారెడ్డి గారు కుక్కడపు సైదులు నాగరాజు ఎండి హసన్ అలీ ఇర్ల నరోత్తమ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు