Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RTC to be merged with Govt ప్రభుత్వంలో విలీనం కానున్న ఆర్టీసీ

బ్రేకింగ్ న్యూస్…

ప్రభుత్వంలో విలీనం కానున్న ఆర్టీసీ

ప్రజా దీవన/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ చారిత్రాత్మక కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే విలీనానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని సమావేశం తీర్మానించింది. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల డిమాండ్లను శాశ్వతంగా పరిష్కరించాలని ఉద్దేశంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించండo జరుగుతుందని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆర్టీసి కి మంచి రోజులు….ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీకి మంచిరోజులు వచ్చాయని చెప్పవచ్చు. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనానికి అడుగులు పడ్డాయి.  కేబినెట్ సమావేశంలో విలీన నిర్ణయం ఆర్టీసీ వర్గాల్లో పండుగవాతావరణం నెలకొంది.నిర్వీర్యమైన ఆర్టీసీలో నెలవారీ వేతనాలు చేతికందే పరిస్థితి కాదుకదా యూనిఫారం దుస్తులు ఇవ్వలేని దయనీయ స్థితికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆర్టీసీ సంస్థలో పనిచేసే 40 వేలమంది ఉద్యోగులు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ మంత్రి వర్గ నిర్ణయాన్ని ప్రకటించారు. రూ. 500 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన లాంఛనలాలను సిద్ధంచేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారనే శుభవార్తను మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీలో పనిచేస్తున్న 43వేల 373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందబోతున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీన బిల్లును ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందబోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీ సంస్థను గాడిలో పెట్టకపోయినా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రతిపాదనాంశం సంతోషదాయకమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.